News August 29, 2024

మణుగూరు: తండ్రిని చంపిన కుమారుడు అరెస్టు

image

కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరులోని బుచ్చి రాములును ఆయన కుమారుడు సూర్యం మంగళవారం కర్రలతో కొట్టి చంపాడు. నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ సతీశ్ వివరాల ప్రకారం.. కొన్ని కారణాల వల్ల సూర్యం భార్య 8 ఏళ్ల కిందట పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి మద్యానికి బానిసైన నిందితుడు ఆస్తి కోసం తల్లిదండ్రులతో తరచూ గొడవ పడేవాడు. ఈక్రమంలో కర్రలతో తండ్రిపై దాడి చేయగా అతడు మృతి చెందాడు.

Similar News

News March 13, 2025

ఖమ్మం: ఇంటర్ పరీక్షలు.. 584 గైర్హాజరు

image

ఖమ్మం జిల్లాలో గురువారం ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు తెలిపారు. జనరల్ కోర్సుల్లో 15,880 మందికి గాను 15,489 మంది, అలాగే ఒకేషనల్ కోర్సుల్లో 2,379 మంది విద్యార్థులకు గాను 2,186 మంది విద్యార్థులు హాజరయినట్లు చెప్పారు. రెండు కోర్సులకు గాను 584 మంది గైర్హాజరయ్యారన్నారు. అటు జిల్లాలో ఇవాళ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.

News March 13, 2025

ఖమ్మం: విషాదం.. BRS నాయకుడి కుమార్తె మృతి

image

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లిలో కొంతకాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్న BRS నాయకుడు చేరుకుపల్లి భిక్షం రెండో కుమార్తె చేరుకుపల్లి శిరీష(23) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ఈరోజు మృతిచెందిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రులయ్యారు. గ్రామస్థులు ఆమె అకాల మరణంపై విచారం వ్యక్తం చేశారు. శిరీష మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 13, 2025

ఖమ్మం: ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంల బదిలీ

image

టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్ డిప్యూటీ ఆర్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న జి.ఎన్.పవిత్ర, భవానీ ప్రసాద్‌ను బదిలీ చేస్తూ సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ సజ్జనార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. భవానీ ప్రసాద్‌ను మహబూబ్‌‌నగర్‌కు, జీ.ఎన్.పవిత్రను షాద్‌నగర్‌‌కు బదిలీ చేశారు. కాగా, వీరి స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.

error: Content is protected !!