News August 29, 2024

విజయనగరం కమిషనర్ టాలెంట్ గురించి మీకు తెలుసా? 

image

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న నల్లనయ్యను తెలుగు భాష అంటే మక్కువ ఎక్కువ. ఉత్తరాంధ్ర మాండలికం అంటే ప్రాణం. ఆ యాస కలకాలం బతికేలా రచనల ద్వారా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. “ఉత్తరాంధ్ర అమ్మమ్మలు, నాయనమ్మల్లార మమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నారా” అంటూ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆయన చేసిందే. ఉత్తరాంధ్ర యాస మనుగడకు తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లు నల్లనయ్య తెలిపారు.

Similar News

News January 22, 2026

భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ జగన్‌దే: జడ్పీ ఛైర్మన్ మజ్జి

image

విజయనగరంలో బుధవారం జరిగిన వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం విమానాశ్రయం పూర్తి క్రెడిట్ జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. జగన్ హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయని, మెజారిటీ భూ నిర్వాసితులు వైసీపి సానుభూతిపరులేనని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు ఈ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

News January 21, 2026

చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి జాతర తేదీలు ఖరారు..

image

చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర తేదీలు ఖరారయ్యాయి. జాతర వివరాలు..
➱ఫిబ్రవరి 22న (ఆదివారం) జాతర ప్రారంభం
➱23న (సోమవారం) పసుపు, కుంకుమ ముర్రాటలతో మొక్కుబడులు చెల్లింపులు
➱24న మంగళవారం రాత్రి గుడిలోకి ఘటాలు రావడంతో జాతర ముగుస్తుంది.
వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

News January 21, 2026

ఆపదలో ఉన్నాం.. డబ్బులు పంపించండి అంటూ కాల్స్: VZM ఎస్పీ

image

ఆపదలో ఉన్నామని చెప్పి ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసే కొత్త తరహా మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ప్రయాణంలో బ్యాగులు పోయాయని, మహిళలు, పిల్లల పేరుతో సహాయం కోరుతూ ఫోన్‌పే, గూగుల్‌పే స్కానర్లు పంపి మోసం చేస్తున్నారని ఆయన బుధవారం తెలిపారు. ఇలాంటి కాల్స్ వస్తే డబ్బులు పంపేముందు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని, అనుమానం ఉంటే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని జిల్లా ప్రజలకు సూచించారు.