News August 29, 2024
విశాఖ: వచ్చే నెల 14న జాతీయ లోక్ అదాలత్

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో వచ్చే నెల 14న జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ తెలిపారు. న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు సివిల్ చెక్ బౌన్స్ బ్యాంకింగ్ మోటార్ ప్రమాదాల నష్ట పరిహారం కేసులు, తగదాలు తదితర వాటిని పరిష్కరించుకోవచ్చని అన్నారు. వివరాలకు 089-2560414 నెంబర్‌కు సంప్రదించాలని కోరారు.
Similar News
News December 27, 2025
ఏయూ మైదానంలో ప్రారంభమైన శ్రామిక ఉత్సవ్

బీచ్ రోడ్‌లోని ఏయు ఎగ్జిబిషన్ మైదానంలోని అఖిలభారత జాతీయ మహాసభలతో పాటు శ్రామిక ఉత్సవ్ కార్యక్రమాన్ని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రారంభించారు. వచ్చి నెల 2వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవం కార్యక్రమంలో పలు సాంకేతిక ప్రదర్శనలు జాతీయస్థాయి ప్రముఖులు పాల్గొన్నారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి నరసింగరావు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ మురళి హాజరు అయ్యారు. మొదటి రోజు కార్యక్రమంలో పుస్తక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
News December 27, 2025
భీమిలికి పెరుగుతున్న వలసలు?

విశాఖ తీరానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ప్రభుత్వం చెబుతుంటే, వలసదారులు అక్కడే వాలుతున్నాయి. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, IT పురోగతి పెరగడం మైగ్రేషన్‌ను పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో 1,2 స్థానాల్లో భీమిలి, గాజువాకలు నిలిచాయి.ప్రస్తుతం భీమిలిలో 3,66,256 మంది ఓటర్లు ఉన్నారు. భీమిలి నియోజకవర్గంలో సగం అర్బన్, సగం గ్రామీణ వాతావరణం ఉంటుంది.
News December 27, 2025
‘ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను జీవీఎంసీ వెబ్ పోర్టల్ నందు చెల్లించండి’

జీవీఎంసీ పరిధిలో ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి పన్ను జీవీఎంసీ యొక్క www. gvmc.gov.in వెబ్సైట్ నందు సులభంగా చేసుకోవచ్చని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి శనివారం తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా చెల్లించుకోవచ్చు అన్నారు. ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని విలువైన సమయం వృథా కాకుండా పన్నులు చెల్లింపు చేయవచ్చు పేర్కొన్నారు.


