News August 29, 2024
మమత వ్యాఖ్యలపై హిమంత ఫైర్

బెంగాల్ తగలబడితే అస్సాం, ఢిల్లీలో కూడా అవే పరిస్థితులు వస్తాయన్న సీఎం మమతా బెనర్జీ <<13961413>>వ్యాఖ్యలపై<<>> అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తీవ్రంగా స్పందించారు. ‘దీదీ.. అస్సాంనే బెదిరించడానికి మీకెంత ధైర్యం? మీ కోపం మాపై ప్రదర్శించకండి. రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దేశాన్ని తగలబెట్టాలని చూడకండి’ అని ధ్వజమెత్తారు. కోల్‌కతా హత్యాచార ఘటన నేపథ్యంలో బెంగాల్‌ను BJP తగలబెట్టాలని చూస్తోందని దీదీ ఆరోపించారు.
Similar News
News January 14, 2026
గంగిరెద్దుల విన్యాసాలు – పల్లెటూరి సందడి

సంక్రాంతి వేళ పల్లె వాకిళ్లలో గంగిరెద్దుల సందడి ఉంటుంది. చక్కగా అలంకరించిన ఎద్దును ఇంటింటికీ తిప్పుతూ, డోలు సన్నాయి వాయిద్యాల మధ్య విన్యాసాలు చేయిస్తారు. ‘అయ్యగారికి, అమ్మవారికి దండం పెట్టు’ అనగానే ఆ ఎద్దు తల ఊపుతూ అభినయించడం ముచ్చటగా ఉంటుంది. శివుని వాహనమైన నందిగా భావించి, ప్రజలు వీటికి పాత బట్టలు, ధాన్యం దానం చేస్తారు. గంగిరెద్దులు ఇంటికి రావడం లక్ష్మీప్రదమని, పశుసంపద వృద్ధి చెందుతుందని నమ్మకం.
News January 14, 2026
IISER తిరుపతిలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) 22 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, డిప్లొమా, MBBS, MD, PG, MSc, MCA, BS-MS, M.LSc, BSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్/స్కిల్/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iisertirupati.ac.in
News January 14, 2026
కోడి పందేల హోరు: గెలిస్తే బుల్లెట్, కారు బహుమతి!

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందేలు రసవత్తరంగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు భారీ బహుమతులు ప్రకటిస్తున్నారు. 6 పందేలు వరుసగా గెలిచిన పుంజుల యజమానులకు బుల్లెట్ బైకులు, కొన్ని చోట్ల ఏకంగా లగ్జరీ కార్లను బహుమతులుగా అందజేస్తున్నారు. దీంతో బరుల వద్ద సందడి నెలకొంది. చట్టపరమైన ఆంక్షలు ఉన్నప్పటికీ రూ.కోట్లాది బెట్టింగ్‌లు, ఖరీదైన ఆఫర్లతో పందెం కోళ్లు కాలుదువ్వుతున్నాయి.


