News August 29, 2024

వైసీపీకి రాజీనామా చేస్తున్నా: ఎంపీ ప్రకటన

image

AP: YS కుటుంబంతో అత్యంత దగ్గరి సంబంధం ఉన్న తాను YCPకి రాజీనామా చేస్తున్నట్లు MP మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు. ‘నా రాజీనామా వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయి. అన్నీ బయటకు చెప్పుకోలేను. ప్రస్తుతానికి నేను, బీదమస్తాన్‌రావు రాజీనామా చేస్తున్నాం. ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదు. మొన్న <<13958618>>టికెట్ <<>>ఇవ్వనప్పుడే మనస్తాపం చెందా. పార్టీకి ద్రోహం చేయకూడదనే అప్పుడు రాజీనామా చేయలేదు’ అని ఆయన చెప్పారు.

Similar News

News March 12, 2025

పోసాని విడుదలకు బ్రేక్!

image

AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లి పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన్ను వర్చువల్‌గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా, పోసానిపై నమోదైన కేసుల్లో బెయిల్ రాగా నేడు విడుదల అవుతారని వార్తలొచ్చాయి. తాజాగా సీఐడీ పీటీ వారెంట్ దాఖలుతో విడుదల నిలిచిపోనున్నట్లు సమాచారం.

News March 12, 2025

పాకిస్థాన్ క్రికెట్ ICUలో ఉంది: అఫ్రీది

image

సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పాకిస్థాన్ క్రికెట్ ఇప్పుడు ICUలో ఉందని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది అన్నారు. ‘PCB నిర్ణయాల్లో కంటిన్యుటీ, కన్సిస్టెన్సీ ఉండట్లేదు. తరచుగా కెప్టెన్, కోచ్‌లను మారుస్తున్నారు. కోచ్‌లు ప్లేయర్లను నిందించడం, మేనేజ్‌మెంట్ స్టాఫ్ తమ పదవుల్ని కాపాడుకునేందుకు కోచ్‌లు, ఆటగాళ్లను నిందించడం విచారకరం’ అని బోర్డు పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

News March 12, 2025

వచ్చే నెల అమరావతికి ప్రధాని మోదీ!

image

AP: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో రాజధాని అమరావతి పనులను పున:ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించగా ఆయన అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ప్రధాని కార్యాలయం అమరావతి పర్యటన తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజధాని పనులను అట్టహాసంగా మళ్లీ స్టార్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 9ఏళ్ల కిందట అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!