News August 29, 2024

విశాఖలో కోర్టుకు హాజరుకానున్న మంత్రి లోకేశ్

image

ఓ పత్రికపై పరువు నష్టం దావా కేసులో మంత్రి లోకేశ్ నేడు విశాఖ కోర్టుకు హాజరుకానున్నారు. ‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ పేరుతో ఆ పత్రికలో గతంలో కథనాన్ని ప్రచురించారు. ఆ కథనంపై లోకేశ్ న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలో పరువునష్టం దావా వేయగా.. విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో వాదోపవాదనలు జరిగేవి. పలు కారణాలతో చాలా రోజులుగా వాయిదాలు పడిన ఈ కేసు విచారణ మళ్లీ ప్రారంభమైంది.

Similar News

News January 21, 2026

జీవీఎంసీ సేవలకు సహకరించండి: కమిషనర్

image

​విశాఖ నగర అభివృద్ధి, స్వచ్ఛ సర్వేక్షన్‌-2025లో ఉత్తమ ర్యాంకు సాధనకు నివాసిత సంక్షేమ సంఘాలు (RWAs) సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. బుధవారం జరిగిన సమావేశంలో సంఘాల ప్రతినిధులు రోడ్లు, డ్రైనేజీ, పార్కుల సమస్యలను ప్రస్తావించారు. సమస్యల తక్షణ పరిష్కారానికి ‘పురమిత్ర’ యాప్ టోల్ ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలన్నారు. కాలనీల్లోని పార్కుల నిర్వహణ బాధ్యతను సంఘాలే తీసుకోవాలని సూచించారు.

News January 21, 2026

గోపాలపట్నం రైల్వే ట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య

image

గోపాలపట్నం రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం కొత్తపాలెం-గోపాలపట్నం రైల్వే క్యాబిన్ వద్ద బాడీ పట్టాలపై ఉండడానికి గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గోపాలపట్నం పోలీసులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడు గోపాలపట్నం లోని మెడికల్ షాప్ నిర్వహిస్తున్న సాయి కృష్ణ‌గా స్థానికులు గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News January 21, 2026

మాతృ మరణాల నివారణకు పకడ్బందీ చర్యలు: DMHO

image

విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు ఆధ్వర్యంలో మాతృ మరణాలపై సమావేశం జరిగింది. మూడు నెలల్లో నమోదైన మాతృ మరణాలపై ఆయన చర్చించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి, మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్, వీజీహెచ్‌కు పంపాలని, సురక్షిత ప్రసవాలు జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.