News August 29, 2024

సెంట్రల్ జైళ్లలో డీఅడిక్షన్ సెంటర్లు

image

AP: రాజమహేంద్రవరం, విశాఖ, నెల్లూరు, కడప సెంట్రల్ జైళ్లలో డీఅడిక్షన్ సెంటర్లు సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.2.45 లక్షల చొప్పున నాలుగింటికి కలిపి రూ.9.80 లక్షల వ్యయం కానుంది. కేంద్ర కారాగారాల్లో గంజాయికి అలవాటు పడిన ఖైదీలు చాలామంది ఉన్నారు. దీంతో జైలులోనే వారికి కౌన్సెలింగ్, వ్యసన విముక్తి కలిగించేలా ట్రీట్‌మెంట్ ఇవ్వనున్నారు.

Similar News

News October 23, 2025

స్థానిక ఎన్నికలే అజెండా.. మరికొన్ని గంటల్లో క్యాబినెట్ భేటీ

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈరోజు 3PMకు క్యాబినెట్​ భేటీ కానుంది. నిలిచిపోయిన ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై కోర్టులు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఎలా ముందుకు వెళ్లాలో సీఎం, మంత్రులు చర్చించనున్నారు. ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే చట్ట సవరణ ఆర్డినెన్స్​ ప్రతిపాదన మంత్రివర్గం ముందుకు రానుంది.

News October 23, 2025

DMRCలో ఉద్యోగాలు

image

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(DMRC)18 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్, బీఈ, డిప్లొమా, ఇంటర్, టెన్త్, సీఏ, ICWA ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://delhimetrorail.com/

News October 23, 2025

మన వాళ్లను ఇక్కడికి రప్పిద్దాం.. కేంద్రం ఆలోచన

image

అమెరికా సహా విదేశాల్లో స్థిరపడిన భారత సంతతి పరిశోధకులు, నిపుణులు, ఫ్యాకల్టీని స్వదేశానికి రప్పించాలని కేంద్రం భావిస్తోంది. వారు ఇక్కడి విద్యాసంస్థల్లో బోధించేలా, రీసెర్చ్‌లు చేసేలా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. IIT వంటి ఉన్నత విద్యా సంస్థల్లో వారికి ఉద్యోగాలిచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యపై ట్రంప్ అనుసరిస్తున్న విధానాల నేపథ్యంలో ఈ దిశగా అడుగులేస్తోంది.