News August 29, 2024
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 16.9 టీఎంసీల నీరు

ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలకు గానూ16.99 టీఎంసీల నీరు నిల్వ ఉంది ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,531 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అదేవిధంగా 10,134 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం కొనసాగుతోంది.
Similar News
News October 31, 2025
KNR: ‘చిట్ ఫండ్స్ వ్యవస్థ అనేది మన సమాజంలో ఆర్థిక సహకారం’

KNR జిల్లా చిట్‌ఫండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పొదుపు దినోత్సవం నిర్వహించారు. ‘ఈరోజు మనం పొదుపు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది కేవలం ఒక ఆచార దినం కాదు. ఇది ప్రతి కుటుంబంలో ఆర్థిక శ్రద్ధ, భవిష్యత్ భద్రత, క్రమశిక్షణకు సంకేతం’ అని అధ్యక్షులు పెంట శ్రీనివాస్ అన్నారు. చిట్ ఫండ్స్ వ్యవస్థ అనేది మన సమాజంలో ఆర్థిక సహకారం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.
News October 31, 2025
సైదాపూర్: రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం: పొన్నం

సైదాపూర్ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వరదలకు కొట్టుకుపోయిన రోడ్లు, నష్టపోయిన పంటలను మొత్తం రికార్డ్ చేయాలని అధికారులను ఆదేశించామని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి వెంట కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ అలం ఉన్నారు.
News October 31, 2025
KNR: బాల్య వివాహాలపై 1098కు ఫిర్యాదు చేయండి

బాల్య వివాహాలు, బాలలపై జరుగుతున్న ఆగడాలపై ధైర్యంగా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఫోన్ చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సూచించారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన (DDU-GKY) కేంద్రంలో గురువారం యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. చైల్డ్ హెల్ప్‌లైన్ అందించే సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఈ సందర్భంగా వివరించారు.


