News August 29, 2024
భారీ వరదలు.. మొబైల్ యూజర్లపై కీలక నిర్ణయం

గుజరాత్లో భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంట్రాసర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని యాక్టివేట్ చేసింది. దీనిద్వారా రాష్ట్రంలోని మొబైల్ యూజర్లు తమ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న నెట్వర్క్ని ఉపయోగించుకోవచ్చు. ఆటోమేటిక్ కనెక్షన్ ద్వారా ఎయిర్టెల్, JIO, VI, BSNLలో బెస్ట్ నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది. రేపు రాత్రి 12 గంటల వరకు ఇది అందుబాటులో ఉండనుంది.
Similar News
News December 28, 2025
కొత్త ఆశలు, సంకల్పంతో నూతన ఏడాదిలోకి: మోదీ

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాతో ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచమే ఆశ్చర్యపోయిందని PM మోదీ అన్నారు. ‘ఏడాది చివర్లో అయోధ్య రామ మందిరంపై పతాకావిష్కరణతో ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండిపోయింది. ఆపరేషన్ సిందూర్ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారింది. స్వదేశీ ఉత్పత్తులపై ప్రజలు ఉత్సాహాన్ని కనబరిచారు. కొత్త ఆశలు, సంకల్పంతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు దేశం సిద్ధం’ అని ‘మన్ కీ బాత్’లో చెప్పారు.
News December 28, 2025
69 అంగన్వాడీ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో <
News December 28, 2025
జియో, NSE, ఓయో.. 2026లో IPOల జాతర

2025లో IPOల జోరు తర్వాత 2026లో ఏకంగా రూ.1 లక్ష కోట్ల సందడి మొదలుకానుంది. దలాల్ స్ట్రీట్‌లోకి దిగ్గజ కంపెనీలు లిస్టింగ్‌కు క్యూ కడుతున్నాయి. అందరూ ఎదురుచూస్తున్న జియో, NSE, ఫోన్‌పే IPOలు వచ్చే ఏడాదే వచ్చే ఛాన్స్ ఉంది. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్, జెప్టో, ఓయో, బోట్ వంటి బడా కంపెనీలు కూడా లిస్టింగ్ రేసులో ఉన్నాయి. SBI MF, ఫ్రాక్టల్ అనలిటిక్స్ వంటి సంస్థలు కూడా ఇన్వెస్టర్లను ఊరించనున్నాయి.


