News August 29, 2024
మాదాపూర్: దుర్గం చెరువులోని 204 భవనాలకు నోటీసులు
హైడ్రా కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల GHMC అధికారులు 204 ఇళ్లకు నోటీసులివ్వడంతో బిక్కుబిక్కుమంటున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో CM సోదరుడు తిరుపతి రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నాయి. ఎఫ్టీఎల్లో ఉన్న ఇంటిపై ఎఫ్ అని మార్కింగ్ కూడా చేశారు.
Similar News
News November 26, 2024
HYD: 10 రోజుల్లోనే ఇంటి నిర్మాణానికి అనుమతి
హైదరాబాద్ వాసులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై 10 రోజుల్లోనే ఇండ్ల నిర్మాణ అనుమతులు పొందవచ్చు. తాజాగా HMDA ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా పెండింగ్ అప్లికేషన్లకు వారం రోజుల్లోనే క్లియరెన్స్ ఇవ్వనున్నారు. గతంలో అనుమతుల కోసం 2 నుంచి 3 నెలల సమయం పట్టేదని.. ప్రజల కోసం ఈ ప్రక్రియ వేగవంతం చేసినట్లు ‘తెలంగాణ కాంగ్రెస్’ ట్వీట్ చేసింది.
SHARE IT
News November 26, 2024
HYDలో పెరిగిన చికెన్ ధరలు
హైదరాబాద్లో చికెన్ ధరలు పెరిగాయి. కార్తీకమాస చివరి సోమవారం ముగియడంతో KGపైన రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచారు. గతవారం కిలో స్కిన్లెస్ రూ. 185 నుంచి రూ. 200 మధ్య అమ్మారు. మంగళవారం స్కిన్లెస్ రూ. 213 నుంచి రూ. 230 వరకు విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 187 నుంచి రూ. 200గా వ్యాపారులు ధరలు నిర్ణయించారు. మరి మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి. కామెంట్ చేయండి.
News November 26, 2024
HYD: ఓయూ వెళ్లేవారికి గుడ్న్యూస్
ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ గేట్లు తెరిచి ఉంచే సమయాన్ని పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం. కుమార్ భద్రతా సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశారు. అందరి అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తార్నాక నుంచి శివం రోడ్ వైపుగా వెళ్లే రహదారిలో గేట్లను రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. ప్రస్తుతం ఈ గేట్లను రాత్రి ఎనిమిది గంటలకే మూసి వేస్తున్నారు. SHARE IT