News August 29, 2024
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్?

వినాయక చవితి (సెప్టెంబర్ 7) రోజున ‘గేమ్ ఛేంజర్’ నుంచి బిగ్ సర్ప్రైజ్ రానున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు ఈ మూవీ నుంచి ఓ పాట లేదా గ్లింప్స్ విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ తెరకెక్కుతోంది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 16, 2026
ఆవులకు దిష్టి తీయడం మరవకండి

భోగి నాడు చిన్నారులపై భోగి పళ్లు పోసి దిష్టి తీసినట్లుగానే, కనుమ నాడు పాడి పశువులకు దిష్టి తీయాలని పండితులు సూచిస్తున్నారు. వాటిపై చెడు ప్రభావం పడకూడదన్నా, ఆయుష్షు పెరగాలన్నా రైతన్నలు ఈ ఆచారం పాటించాలంటున్నారు. పసుపు, కుంకుమలు కలిపిన నీటితో, హారతితో పశువులకు దిష్టి తీయాలి. అవి లక్ష్మీ స్వరూపంతో సమానం. ఇలా చేస్తే పశుసంపద సంక్షేమంగా ఉండి, రైతు ఇల్లు పాడి పంటలతో కళకళలాడుతుందని పండితులు చెబుతున్నారు.
News January 16, 2026
నేటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. కొరాట-చనాక బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేసిన అనంతరం సదర్మాట్ బ్యారేజ్‌ను ప్రారంభిస్తారు. రేపు మహబూబ్‌నగర్, ఎల్లుండి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో పాటు ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు నిరసనగా సభలు నిర్వహించనున్నారు.
News January 16, 2026
వరుసగా అబార్షన్లు అవుతున్నాయా?

గర్భం దాల్చిన ప్రతిసారీ అబార్షన్ అవుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రెండోసారి అబార్షన్ జరిగితే డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని టెస్టులు చేయించి మందులు వాడాలి. గర్భస్రావం జరిగినప్పుడు పిండాన్ని టెస్టుకి పంపి జన్యు సమస్యలున్నాయో తెలుసుకోవచ్చు. మేనరికం అయితే దంపతులకి టెస్టులు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు రక్తపరీక్షలు, స్కానింగ్ వంటివి చేసి వాటికి తగ్గ ట్రీట్మెంట్ చేయాలి.


