News August 29, 2024
ముంబై నటి వ్యవహారం.. ఉన్నతస్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం

AP: ముంబై నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆమె నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సూచించింది. <<13964003>>వేధింపుల<<>> ఘటనకు సంబంధించిన వివరాలను విజయవాడ పోలీసులు సేకరిస్తున్నారు. పోలీసు బృందాలను ముంబైకి పంపనున్నట్లు సమాచారం.
Similar News
News March 14, 2025
OTTలోకి వచ్చేసిన కంగనా ‘ఎమర్జెన్సీ’

కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా, 3 రోజుల ముందే రిలీజ్ చేశారు. ఇందులో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు. ఈ సినిమాతో పాటు రాషా తడానీ, అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘ఆజాద్’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
News March 14, 2025
RSS, BJPకి సారీ చెప్పను: గాంధీ మునిమనుమడు

RSS, BJPకి క్షమాపణ చెప్పనని, వాటిపై వ్యాఖ్యలనూ వెనక్కి తీసుకోనని మహాత్మాగాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ తెలిపారు. అవి రెండూ ప్రమాదకరం, విషపూరితం, దేశానికి అంతర్గత శత్రువులంటూ ఈ మధ్యే ఆయన విమర్శించారు. ఆయన సారీ చెప్పాలని, కేసు నమోదు చేయాలని సంఘ్, BJP నేతలు డిమాండ్ చేశారు. ‘ద్రోహులను మరింత బయటపెట్టాలన్న నా పట్టుదలకు జరిగిన ఘటన బలం చేకూర్చింది. స్వతంత్ర పోరాటం కన్నా ఇదే అతి ముఖ్యం’ అని తుషార్ అన్నారు.
News March 14, 2025
గ్రూప్-3 ఫలితాలు విడుదల

టీజీపీఎస్సీ వరుసగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదల చేస్తోంది. మూడు రోజుల క్రితం గ్రూప్-1, రెండు రోజుల కిందట గ్రూప్-2 రిజల్ట్స్ ఇవ్వగా తాజాగా గ్రూప్-3 ఫలితాలు వెలువరించింది. జనరల్ ర్యాంకింగ్స్‌తో పాటు మాస్టర్స్ క్వశ్చన్ పేపర్స్, ఫైనల్ కీ కూడా విడుదల చేసింది. 1365 గ్రూప్-3 పోస్టులకు గతేడాది నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించగా 2.69 లక్షల మంది హాజరయ్యారు.
Results PDF: <