News August 29, 2024
GREAT: తమిళనాడులో తెలుగు బోర్డులు
తమిళనాడులోని హోసూరు పట్టణం తెలుగుకు పెద్దపీట వేస్తోంది. ఏపీ, తెలంగాణ నుంచి వలస వెళ్లిన తెలుగువారు అక్కడ ఎక్కువగా ఉంటారు. వారిలో చాలా మంది పారిశ్రామికవేత్తలుగా స్థిరపడ్డారు. అక్కడి అధికారులు ప్రభుత్వ కార్యాలయాల బోర్డులను తమిళం, ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ రాస్తారు. తెలుగు మీడియంలో బోధించే స్కూళ్లు కూడా ఉన్నాయి. ఇటీవల ఆ ప్రాంత ఎంపీ గోపినాథ్ తెలుగులోనే ప్రమాణం చేశారు.
*నేడు తెలుగు భాషా దినోత్సవం
Similar News
News January 22, 2025
కేజ్రీవాల్‌పై బీజేపీ ‘చునావీ హిందూ’ ఎటాక్
రామాయణంలోని ఓ అంశాన్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ తప్పుగా చెప్పడంపై ఢిల్లీ ఎన్నికల వేళ BJP ఆయనపై ఎటాక్ చేస్తోంది. ‘చునావీ(ఎన్నికల) హిందూ’ అంటూ విమర్శిస్తోంది. ఆయన సనాతన ధర్మాన్ని కించపరిచారని ఢిల్లీ BJP అధ్యక్షుడు V. సచ్‌దేవా మండిపడ్డారు. ఎన్నికలప్పుడే ఆయనకు ఆలయాలపై ప్రేమ పుట్టుకొస్తుందని ఎద్దేవా చేశారు. BJP నేతలు రావణుడిని ఇష్టపడుతున్నారని, వారి స్వభావం అలాంటిదే అని కేజ్రీవాల్ ఎదురుదాడికి దిగారు.
News January 22, 2025
AP & TGలో ఏడాదికి రూ.కోటి సంపాదించేవారు ఎంతంటే?
ఏడాదికి రూ.కోటి సంపాదించే వారు అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్-2024 డేటా ప్రకారం అక్కడ ఏకంగా 1,24,800 మంది కోటికి పైగా సంపాదిస్తున్నారు. అత్యల్పంగా లక్షద్వీప్‌లో కేవలం ఒకరు, లద్దాక్‌లో ముగ్గురు మాత్రమే రూ.1 కోటి అర్జిస్తున్నారు. ఇక ఏపీలో 5,340 మంది ఉండగా తెలంగాణలో 1,260 మంది ఉన్నారు.
News January 22, 2025
మీరే ప్రధాని అయితే..
USA అధ్యక్షుడైన తొలిరోజే ట్రంప్ సంతకాలతో సంచలనాలు సృష్టిస్తున్నారు. పుట్టుకతో పౌరసత్వం, WHO నుంచి USA ఎగ్జిట్, దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ సహా అనేక ముఖ్య నిర్ణయాలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేస్తున్నారు. ఈ సంతకాలపై USతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే ‘ఒకే ఒక్కడు’లో ఒక్కరోజు CMలా, మీరు ఒక్కరోజు ప్రధానిగా ఒక్క నిర్ణయం అమలు చేసే అధికారం వస్తే ఏ ఫైలుపై సైన్ చేస్తారు? కామెంట్ చేయండి.