News August 29, 2024

₹1.4కోట్ల కారు కొన్న సల్మాన్ బాడీ‌గార్డ్!

image

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బాడీ‌గార్డ్ షేరా(గుర్మీత్ సింగ్ జోలీ) ఇటీవల ఖరీదైన రేంజ్ రోవర్ కారు కొన్నారు. దాని విలువ ₹1.4కోట్లు అని తెలుస్తోంది. కారు కొన్న విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా ‘షేరా అన్నా నన్ను మీ బాడీగార్డుగా పెట్టుకోండి. నేను కూడా కారు కొనుక్కుంటా’ అని కామెంట్స్ వస్తున్నాయి. షేరా 1995 నుంచి సల్మాన్ దగ్గర పని చేస్తున్నారు. అతడికి సొంతంగా సెక్యూరిటీ సంస్థ కూడా ఉంది.

Similar News

News November 4, 2025

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కమిటీ

image

TG: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సంస్కరణలకు ప్రభుత్వం కమిటీని నియమించింది. స్పెషల్ సీఎస్ ఛైర్మన్‌గా, ప్రిన్సిపల్ సెక్రటరీ వైస్ ఛైర్మన్‌గా 15 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాలేజీ యాజమాన్యాల నుంచి ముగ్గురికి, ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరామ్‌కు చోటు కల్పించింది. రీయింబర్స్‌మెంట్ విధానంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లో తమ రిపోర్టును ప్రభుత్వానికి అందజేయనుంది.

News November 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 56 సమాధానాలు

image

1. కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడి ‘పరుశరాముడు’.
2. మేఘనాదుడు ‘తమ కుటుంబ దేవత అయిన నికుంభి’లను పూజించడం వల్ల ఇంద్రజిత్ అయ్యాడు.
3. నవ విధ భక్తి మార్గాలలో మొదటిది ‘శ్రవణం’.
4. ప్రతి మాసంలో వచ్చే పన్నెండో తిథి పేరు ‘ద్వాదశి’.
5. సీత స్వయంవరం లో ఉన్న శివ ధనుస్సు అసలు పేరు ‘పినాక’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 4, 2025

వరల్డ్‌కప్ విజేతలు విక్టరీ పరేడ్‌కు దూరం

image

ICC ఉమెన్స్ వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు విక్టరీ పరేడ్‌‌కు దూరం కానుంది. ఈ మేరకు BCCI ప్రకటించింది. ఈ ఏడాది IPL కప్ విజేత RCB చేపట్టిన పరేడ్‌లో తొక్కిసలాట జరిగి ఫ్యాన్స్ మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో ర్యాలీ చేపట్టడం లేదని చెబుతున్నారు. రేపు ఢిల్లీలో PM చేతుల మీదుగా టీమ్‌ ఇండియాను సన్మానిస్తారు. తొలిసారి ఉమెన్ వరల్డ్‌కప్ గెలిచినా పరేడ్ లేకపోవడంపై విమర్శలొస్తున్నాయి.