News August 29, 2024

వరంగల్ మార్కెట్లో చిరు ధాన్యాల ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ ధర రూ.5,910 పలకగా పచ్చి పల్లికాయ ధర రూ.3500 పలికింది. మరోవైపు పసుపు కి రూ.11,885 ధర రాగా, 5531 రకం మిర్చికి నిన్న రూ.13,500, టమాటా రకం మిర్చికి రూ.19 వేల ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News March 30, 2026

వరంగల్: మూడు నెలల బియ్యం పంపిణీకి సిద్ధం

image

వరంగల్ జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం రేషన్ దుకాణాలకు తరలింపు ప్రారంభమైంది. సుమారు 509 దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. నెలవారీ 5,594.26 మెట్రిక్ టన్నుల బియ్యం స్థానంలో మూడు నెలలకు కలిపి 16,858.94 మెట్రిక్ టన్నులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 2,95,442 రేషన్ కార్డులు, 8,92,330 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 29, 2026

ఆస్తి పన్నుపై ఎలాంటి వడ్డీ మాఫీలేదు: కలెక్టర్

image

ఆస్తి పన్నుపై ఎలాంటి వడ్డీ మాఫీ లేదని,నగర ప్రజలు ఈనెల 31వ తేదీ లోపు పన్నులు చెల్లించి జరిమానా భారాన్ని నివారించుకోవాలని కలెక్టర్, జీసీడబ్ల్యూపీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. ఆదివారం వరంగల్‌లో 14,37,38 డివిజన్లలో, హనుమకొండలోని 5వ డివిజన్లోని సురేంద్రపురి, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో పన్నుల సేకరణను పరిశీలించారు. ఉప కమిషనర్లు ప్రసన్నరాణి, బిర్రు శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

News March 29, 2026

వరంగల్ బస్టాండ్‌లో తాగునీటి కష్టాలు!

image

వరంగల్ నగరంలో ఎండలు మండిపోతున్న తరుణంలో బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. బస్టాండ్‌లో కనీస మంచినీటి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్నా అధికారులు చలివేంద్రం ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉచిత తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.