News August 29, 2024
నూతన మద్యం పాలసీ రూపకల్పనకు క్యాబినెట్ సబ్ కమిటీ

AP: నూతన మద్యం పాలసీ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ప్రస్తుతమున్న లిక్కర్ పాలసీని సమీక్షించడంతో పాటు వివిధ రాష్ట్రాల్లోని మద్యం విధానాలపై అధ్యయనం చేయనుంది. పాలసీ రూపకల్పనకు వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకోనుంది.
Similar News
News October 21, 2025
తెలంగాణలో తగ్గిన పప్పు దినుసుల సాగు

TG: రాష్ట్రంలో ఈ ఏడాది పప్పు దినుసుల సాగు విస్తీర్ణం తగ్గింది. గత ఏడాది 8,25,236 ఎకరాల్లో పప్పు దినుసులను సాగు చేయగా.. ఈ ఏడాది 5,83,736 ఎకరాలకే పరిమితమైంది. వర్షాభావ పరిస్థితులు, ధరల్లో హెచ్చుతగ్గులు, మార్కెటింగ్ సమస్యలు, పంట రవాణా వ్యయం పెరుగుదల, నిల్వ వసతులలేమి కారణంగా ఈ పంటల సాగు విస్తీర్ణం తగ్గినట్లు తెలుస్తోంది. పప్పు దినుసుల్లో కందులు, పెసలు, మినుములను రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు.
News October 21, 2025
ఆక్వా రైతులకు శుభవార్త చెప్పిన లోకేశ్

AP: ఆక్వా రైతులకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. ఇప్పటివరకు తెల్లమచ్చ వైరస్ కారణంగా పొట్టు తీయని రొయ్యల ఎగుమతులపై ఆస్ట్రేలియా పరిమితులు విధించగా తాజాగా వాటిని ఎత్తివేసి ఎగుమతులకు అనుమతించిందని మంత్రి చెప్పారు. దీనికోసం కృషిచేసిన ఇండియా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు కొత్త మార్కెట్లకు విస్తరించాల్సిన అవసరముందని ఇది నిరూపిస్తోందని వివరించారు.
News October 21, 2025
తరింపజేసే పంచమహామంత్రాలు

మనః అంటే మనసు, త్ర అంటే రక్షించేది. మనసును రక్షించేదే మంత్రం. ఇది దైవస్వరూపం. మంత్రం ఉచ్చరించినపుడు అందులో నాదబలం మనసును శాంతపరచి, ఆత్మను ఉన్నతస్థితికి తీసుకెళ్తుంది. పంచమహామంత్రాలివే..
1.ఓంనమఃశివాయ- పంచాక్షరీమంత్రం 2.ఓం నమో నారాయణాయ-అష్టాక్షరీమంత్రం 3.ఓం నమో భగవతే వాసుదేవాయ-ద్వాదశాక్షరీ మంత్రం, 4.ఓంభూర్భువఃస్వహ-గాయత్రీ మంత్రం, 5.ఓంత్రయంబకం యజామహే-మహామృత్యుంజయ మంత్రం.