News August 29, 2024
త్వరలో భూ అక్రమాల వివరాల ప్రకటన: మంత్రి లోకేశ్

AP: వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమాలు జరిగాయని మంత్రి లోకేశ్ అన్నారు. ఎక్కడ ఎన్ని ఎకరాల అక్రమాలు జరిగాయో త్వరలో వెల్లడిస్తామన్నారు. ‘గత ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రం నుంచి పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి. చంద్రబాబు సీఎం అయ్యాక పారిశ్రామిక వేత్తలు మళ్లీ రాష్ట్రానికి వస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన 6 హామీలకు కట్టుబడి ఉన్నాం’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.
Similar News
News September 1, 2025
కాళేశ్వరంపై CBI విచారణకు నిర్ణయం.. ఇందుకేనా?

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం CID లేదా సిట్ ద్వారా విచారణ చేపట్టే అవకాశముందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం ఈ కేసును <<17577217>>CBIకి<<>> అప్పగించాలని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మాజీ సీఎం KCR అరెస్ట్ అయితే కక్షపూరిత చర్యలు తీసుకుందనే అపవాదు రాకుండా జాగ్రత్త పడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలని నిర్ణయించిందని చెబుతున్నారు.
News September 1, 2025
సెప్టెంబర్ 1: చరిత్రలో ఈ రోజు

1945: నేత్రవైద్య నిపుణుడు, పద్మశ్రీ గ్రహీత గుళ్లపల్లి నాగేశ్వరరావు జననం
1947: లోక్సభ మాజీ సభాపతి పి.ఎ.సంగ్మా జననం
1950: తెలుగు సినీ దర్శకుడు టి.కృష్ణ జననం
1904: తెలుగు పండితుడు పూండ్ల రామకృష్ణయ్య మరణం
1990: తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు మరణం
1992: సాహిత్యవేత్త ఎస్.వి.జోగారావు మరణం
1995: AP 19వ CMగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం(ఫొటోలో)
News September 1, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.