News August 29, 2024
ప్రస్తుత పరిస్థితి నీ భవిష్యత్తును నిర్ణయించదు: గోయెంకా

ప్రస్థుత పరిస్థితిపై దిగులు చెందేవారిని మోటివేట్ చేస్తూ ప్రముఖ వ్యాపారవేత్త హర్షా గోయెంకా చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఆర్థిక పరిస్థితిపై బాధపడకుండా కష్టపడి పనిచేస్తే భవిష్యత్తు మారుతుందని సూచించారు. ‘లంబోర్ఘిని కంపెనీ ట్రాక్టర్ తయారుచేసేది. శామ్సంగ్ కిరాణా దుకాణం. LG ఒక ఫేషియల్ క్రీమ్. IKEA పెన్నులను విక్రయించేది’ అని తెలిపారు. వీటిలాగే ప్రస్తుత పరిస్థితి కూడా చివరి గమ్యస్థానం కాదని తెలిపారు.
Similar News
News September 17, 2025
ఈ నెల 23 నుంచి ఓటీటీలోకి ‘సుందరకాండ’

నారా రోహిత్, శ్రీదేవి, వర్తి వాఘని ప్రధాన పాత్రల్లో నటించిన ‘సుందరకాండ’ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 23 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రం గత నెల 27న థియేటర్లలో రిలీజైంది.
News September 17, 2025
కాసేపట్లో యూఏఈతో మ్యాచ్.. హోటల్లోనే పాక్ ఆటగాళ్లు

ఆసియా కప్‌లో భారత్‌తో హ్యాండ్ షేక్ వివాదం నేపథ్యంలో పాకిస్థాన్ హర్ట్ అయిన విషయం తెలిసిందే. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. లేదంటే ఇవాళ యూఏఈతో మ్యాచ్ ఆడబోమని చెప్పింది. ఈక్రమంలోనే రా.8 గంటలకు యూఏఈతో మ్యాచ్ జరగాల్సి ఉండగా, పాక్ ఆటగాళ్లు హోటల్ రూమ్‌లోనే ఉండిపోయారు. మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
News September 17, 2025
మైథాలజీ క్విజ్ – 8 సమాధానాలు

1. మైథిలి అంటే ‘సీతాదేవి’. మిథిలా నగరానికి రాజైన జనకుడి పుత్రిక కాబట్టి ఆమెను మైథిలి అని పిలుస్తారు.
2. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల ప్రధాన సైన్యాధిపతి ‘ధృష్టద్యుమ్నుడు’. ఆయన ద్రౌపదికి సోదరుడు.
3. ‘పూతన’ అనే రాక్షసిని చంపింది శ్రీకృష్ణుడు.
4. విష్ణువు శయనించే పాము పేరు ‘ఆది శేషుడు’. ఈ సర్పానికి ‘అనంత’ అనే పేరు కూడా ఉంది.
5. బృహదీశ్వర ఆలయం తమిళనాడులోని తంజావూరు నగరంలో ఉంది. <<-se>>#mythologyquiz<<>>