News August 29, 2024
వినాయక చవితి వేడుకల అనుమతులపై హోంమంత్రి సమీక్ష

వినాయక చవితి ఉత్సవాల అనుమతిపై గురువారం హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నట్లు వివరించారు. మొబైల్ నుంచి https://ganeshutsav.net/ ద్వారా ఉత్సవాలకు అనుమతులు పొందవచ్చునని వివరించారు. శుక్రవారం నుంచి యాప్ అందుబాటులోకి వస్తుందని, ఉత్సవాలకు సంబంధించి వివరాలు పెట్టిన తరువాత అన్ని విభాగాల అధికారులు పరిశీలిస్తారన్నారు.
Similar News
News July 5, 2025
విశాఖలో ఏఐతో ఛలానాలు..!

విశాఖ సిటీలో ట్రాఫిక్‌ను సమర్థంగా నిర్వహించేందుకు ఏఐ ఆధారిత రోడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అమలు చేయనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్క్ తెలిపారు. ట్రాఫిక్ అదనపు డీసీపీ రామరాజు, ఇతర అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పలు సంస్థలు పైలట్ ప్రాజెక్టులు చేపట్టాయని తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా అతివేగం, హెల్మెట్ లేని ప్రయాణం వంటి ఉల్లంఘనలకు ఆటోమేటిక్ ఛలానా జారీ అవుతుందన్నారు.
News July 5, 2025
విశాఖలో ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డు సస్పెండ్: సీపీ

విశాఖలో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును సస్పెండ్ చేస్తూ సీపీ శంఖబ్రత బాగ్చీ ఉత్తర్వులు జారీ చేశారు. కంచరపాలెం స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్స్ సన్నీబాబు, ఎస్.రామకృష్ణ, హోంగార్డు గురునాయుడు విధి నిర్వహణలో ఉండగా లారీలు ఆపి అక్రమ వసూలు చేసినట్లు కమిషనర్ దృష్టికి వెళ్లింది. దీంతో దర్యాప్తు చేసి ముగ్గురిని సస్పెండ్ చేశారు. పోలీస్ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే వాట్సాప్‌లో తనను సంప్రదించాలన్నారు.
News July 5, 2025
విశాఖ: ‘జులై 10న దుకాణాలకు బహిరంగ వేలం’

GVMC జోన్-4 పరిధిలో దుకాణాలు, కళ్యాణ మండపాలు, రోడ్ సైడ్ మార్కెట్లకు జులై 10న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు శుక్రవారం తెలిపారు. జోన్ పరిధిలోని డైక్స్ ట్యాంక్ వాణిజ్య సముదాయము, జగదాంబ వాణిజ్య సముదాయం, పాత బస్ స్టాండ్ దుకాణాములు, పలు వార్డుల్లో వ్యాపార సముదాయాలను వేలం వేస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు జీవీఎంసీ జోన్-4 జోనల్ ఆఫీసు వద్ద జులై 10న ఉ.11గంటలకు హాజరుకావాలన్నారు.