News August 29, 2024

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ ఫారం

image

నిర్ణీత నిబంధనల ప్రకారం పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల కోసం కొత్త సరళీకృత పెన్షన్ దరఖాస్తు ఫారం 6-Aని శుక్ర‌వారం విడుద‌ల చేయ‌నున్న‌ట్టు కేంద్రం ప్ర‌క‌టించింది. డిసెంబర్ 2024లో, ఆ తర్వాత పదవీ విరమణ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ ఫారం భవిష్య/E-HRMSలో అందుబాటులో ఉంటుందని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 9 రకాల ఫాంలు/ఫార్మాట్‌లను కలిపి ఈ కొత్త పెన్షన్ ఫారం రూపొందించినట్టు తెలిపింది.

Similar News

News January 30, 2026

కొబ్బరి మొక్కల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

కొబ్బరిలో అధిక దిగుబడి రావాలంటే మొక్కల ఎంపిక కీలకం. మొక్కల వయస్సు 10-12 నెలలు ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. ఆకుల సంఖ్య 6, అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క కాండం మొదలు చుట్టుకొలత పొట్టి రకానికి 8 సెం.మీ., పొడవు రకానికి 10 సెం.మీ. కంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క ఎత్తు పొట్టి రకాలకు 80 సెం.మీ. మరియు పొడవు, హైబ్రిడ్ మొక్కలకు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 30, 2026

భారీగా తగ్గిన బంగారం ధర

image

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధర ఇవాళ భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.8,230 తగ్గి రూ.1,70,620కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.7,550 పతనమై రూ.1,56,400 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News January 30, 2026

పార్టీలకు ఇచ్చే భూమి 50 సెంట్లకు పెంపు

image

AP: నియోజకవర్గ కేంద్రాల్లో రాజకీయ పార్టీలకు లీజుకు ఇచ్చే భూమి విషయంలో ప్రభుత్వం కీలక సవరణ చేసింది. రాష్ట్ర, జాతీయ స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఇచ్చే భూమిని 30 సెంట్ల నుంచి 50 సెంట్లకు పెంచింది. ఈ భూమిని లీజుకు ఇచ్చినందుకు పార్టీల నుంచి ఏడాదికి రూ.వెయ్యి చొప్పున వసూలు చేయనున్నారు. దీనికి సంబంధించి జీవో 575లో పాయింట్ 1, 3లను సవరిస్తూ రెవెన్యూ శాఖ జీవో 62ను విడుదల చేసింది.