News August 29, 2024

100 బిలియన్ ఎకానమీగా విశాఖను అభివృద్ధి చేస్తాం: మంత్రి లోకేశ్

image

మెరుగైన ఐటీ పాలసీతో ప్రఖ్యాత ఐటీ పరిశ్రమలను ఏపీకి రప్పిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. గురువారం ఆయన ఓ హోటల్‌లో ఐటీ ప్రముఖులతో సమావేశమయ్యారు. 100 బిలియన్ ఎకానమీగా విశాఖ మహానగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఐటీ పరిశ్రమలకు రాయితీలను అందజేస్తామన్నారు. ఐటీలో ఎంత ఎక్కువ ఉద్యోగాలిస్తే అంత మెరుగైన ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఐటీ పరిశ్రమలు సహకరించాలని కోరారు.

Similar News

News January 21, 2025

ఎదురుకాల్పుల్లో కీలక నేతలు మృతి?

image

ఛ‌త్తీస్‌ఘ‌డ్-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మంగళవారం తెల్ల‌వారుజామున జ‌రిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుడు చ‌ల‌ప‌తి, ఒడిశా మావోయిస్టు పార్టీ ఇన్‌‌ఛార్జ్ మొండెం బాల‌కృష్ణ మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. అధికారికంగా వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా ఇంకా గాలింపు చ‌ర్య‌లు జ‌రుగుతుండగా,మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌ముందని పోలీసు వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యమయ్యాయి.

News January 21, 2025

పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం

image

పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో కెమ్ కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 21, 2025

స్టీల్ ప్లాంట్: విద్యుత్ షాక్‌తో కార్మికుడి దుర్మరణం

image

స్టీల్ ప్లాంట్‌ రైల్వే లైన్‌లో విద్యుత్ షాక్‌తో కాంట్రాక్టు కార్మికుడు సోమవారం మృతి చెందాడు. ఇస్లాం పేటకు చెందిన మహమ్మద్ గౌస్ (26) స్టీల్ ప్లాంట్‌లో రైల్వేకు చెందిన సురభి ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేస్తున్నాడు. ట్యాంకర్‌పై ఉన్న విద్యుత్ లైన్లు తాకడం వల్ల షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.