News August 30, 2024

ఆరోగ్యం కోసం క్రీడలు చాలా ముఖ్యం: కడప కలెక్టర్

image

మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని కోటిరెడ్డి సర్కిల్ ప్రాంగణంలో 3కె రన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. విద్యార్థి, యువత దశలో క్రీడల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 27, 2025

కడప: నలుగురిని సస్పెండ్ చేసిన కలెక్టర్

image

భారత ఎన్నికల సంఘం ఆదేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నలుగురు పోలింగ్ బూత్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల సర్వేలో విధుల్లో తీవ్ర అలసత్వం వహిస్తున్నట్లు తెలిపారు. భాగంగా సీ.కే దిన్నెలోని తాడిగొట్ల, వల్లూరులోని టీజీ పల్లె, వీరపునాయుని పల్లెలోని అలిదెన, ఎన్. పాలగిరి సచివాలయాల్లో పనిచేస్తున్న BLOలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

News December 27, 2025

జనవరి 11 లోపు ‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి

image

పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జనవరి 11వ తేదీ లోపు పూర్తి చేయాలని డైట్ లెక్చరర్ కె.వి.సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం వల్లూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలలను ఆయన సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం దక్కుతుందని, తద్వారా పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాయగలుగుతారని ఆయన పేర్కొన్నారు.