News August 30, 2024
బంగ్లా అల్లర్లలో 1000 దాటిన మరణాలు

ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న అల్లర్లలో మరణాల సంఖ్య 1000 దాటినట్లు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు గాయపడిన వారికి ఉచిత చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. మరణించిన వారి కుటుంబ సభ్యుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆ దేశంలో నిరసనలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి పరిణామాలు షేక్ హసీనాను గద్దె దించేలా చేశాయి.
Similar News
News September 14, 2025
ముప్పైల్లోనే ముడతలా..?

ప్రస్తుతం చాలామందిలో ప్రీమెచ్యూర్ ఏజింగ్ కనిపిస్తోంది. ఫోన్లు, ల్యాప్‌టాప్ నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా చిన్నవయసులోనే వృద్ధాప్యఛాయలు కన్పిస్తున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. బ్లూ లైట్‌కు ఎక్కువగా ప్రభావితం కావడం వల్ల చర్మం సాగే గుణం కోల్పోతుంది. దీంతో ముడతలు వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే గ్యాడ్జెట్లను తక్కువగా వాడటంతోపాటు బ్లూ లైట్ ఎఫెక్ట్‌ను తగ్గించే హైలురోనిక్ యాసిడ్ ఉన్న క్రీములను వాడాలి.
News September 14, 2025
SLBC కూలి 200 రోజులైనా స్పందించని కేంద్రం: కేటీఆర్

TG: SLBC టన్నెల్ కూలి 200 రోజులైనా కేంద్రం స్పందించడం లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికీ బాధితులకు ఎలాంటి పరిహారం అందించలేదని ఎక్స్‌లో ఆరోపించారు. ‘కాళేశ్వరంలో చిన్నపాటి లోపాలకే హంగామా చేసిన కేంద్ర ప్రభుత్వం SLBC ఘటనపై ఒక్క బృందాన్ని కూడా పంపలేదు. చోటా భాయ్‌ను బడే భాయ్ కాపాడుతున్నారు. మేము ఈసారి అధికారంలోకి వస్తే బాధితులకు న్యాయం చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
News September 14, 2025
త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం

లక్నో విమానాశ్రయంలో లక్నో- ఢిల్లీ ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎంపీ డింపుల్ యాదవ్‌తో పాటు 151 మంది ప్రయాణికులు ఉన్న విమానం టేకాఫ్ సమయంలో రన్‌వే మీద ఒక్కసారిగా స్లో అయింది. పైలట్ చాకచక్యంగా ఎమర్జెన్సీ బ్రేకులను ఉపయోగించి ఫ్లైట్‌ను రన్‌వే దాటకుండా ఆపారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.