News August 30, 2024

రేషన్ కార్డుదారులకు తీపి కబురు

image

రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు పంచదార పంపిణీకి చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయంటూ 2 నెలలుగా పంచదార పంపిణీ ఆపేసిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లాలో 6,76,209 మంది రేషన్ కార్డుదారులకు 10,715 టన్నుల బియ్యం, 352 టన్నుల పంచదార, నంద్యాల జిల్లాలో 5,41,804 మంది కార్డుదారులకు 7,361 టన్నుల బియ్యం, 276 టన్నుల పంచదార పంపిణీ చేయనుంది.

Similar News

News January 13, 2026

కర్నూలు: ‘రూ.8 వేలతో కొంటాం’

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీలో నాఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటి ద్వారా క్వింటాకు రూ.8,000 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని మార్కెట్ యార్డ్ కార్యదర్శి ఆర్.జయలక్ష్మి తెలిపారు. కంది పంట నమోదు చేసిన ఈ-క్రాప్ సర్టిఫికెట్‌తో పాటు తేమ శాతం పరీక్షకు కందుల శాంపిల్ తీసుకొని రావాలని రైతులను సూచించారు.

News January 12, 2026

సౌత్ జోన్ స్థాయి ఫుట్‌బాల్ విజేత అనంతపురం ఆర్డీటీ

image

కర్నూలులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న సౌత్ జోన్ స్థాయి మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంటులో అనంతపురం ఆర్డీటీ జట్టు చెన్నై యాసిస్ క్లబ్ జట్టుపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి కప్పు కైవసం చేసుకుంది. మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు త్రీ టౌన్ సీఐ శేషయ్య, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా శాంతి అందజేశారు.

News January 12, 2026

అక్షరాంధ్రతో జిల్లాలో అక్షరాస్యత పెంపు: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతాన్ని పెంచాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లాలోని 1.61 లక్షల నిరక్షరాస్యులకు వాలంటీర్ల ద్వారా చదువు నేర్పించి, మార్చి 29న జరిగే పరీక్షలో ఉత్తీర్ణులయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. శిక్షణ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించి, ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లు అందించి ప్రోత్సహించాలని సూచించారు.