News August 30, 2024

శ్రీకాకుళం: అదనపు ఎరువుల కోసం ఆదేశాలు జారీ

image

ఇటీవల శ్రీకాకుళం జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు అధికారుల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు ఎరువుల కొరత అంశాన్ని ప్రస్తావించడంతో స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మార్క్ ఫెడ్ ఉన్నాతధికారులను గురువారం ఆదేశించారు. జిల్లాకు 820 టన్నుల డిఏపి, 760 టన్నుల యూరియా సరఫరాకు చర్యలు చేపట్టారు. శుక్రవారం నుంచే రైతులకు పంపిణీ చేయాలన్నారు.

Similar News

News July 7, 2025

శ్రీకాకుళం: గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా..రూట్ మ్యాప్ ఇదే

image

గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈనెల 9 ఉ.6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 వరకు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వచ్చు ప్రైవేటు ట్రావెల్ బస్సులు, RTC బస్సులు, ఇతర వాహనదారులు నగరంలోకి రాకుండా ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలని సూచించారు.

News July 7, 2025

శ్రీకాకుళం: సేంద్రీయ ఎరువులతో అధిక దిగుబడి

image

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో డీపీఆర్సీ వారు ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టు స్టాల్‌లను DPO భారతి సౌజన్య సోమవారం పరిశీలించారు. సంపద కేంద్రాల్లో చెత్త ద్వారా వర్మీ కంపోస్టు తయారీ చేసి అమ్మకాలు జరపాలని తెలిపారు. సేంద్రియ ఎరువులపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వలన అధిక పంట దిగుబడి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్సీ రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.

News July 7, 2025

నందిగాం: పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య

image

నందిగాం మండలం జయపురం గ్రామానికి చెందిన ఆర్.రత్నాలు(54) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గత కొద్ది రోజులుగా మహిళ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి ఇంటిలో పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో చేరుకున్న ఆమెను కుటుంబీకులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. నందిగాం పోలీసులు కేసు నమోదు చేశారు.