News August 30, 2024
భగభగ మండే సూరీడే.. పెరిగే ధరలకు సంకేతం

దేశంలో వానలు కాకుండా పెరుగుతున్న ఎండల్ని చూసి ఎకానమిస్టులు ద్రవ్యోల్బణాన్ని మెరుగ్గా అంచనావేసే పరిస్థితులు వచ్చాయని HSBC తెలిపింది. ‘గత పదేళ్లలో తీవ్ర ఉష్ణోగ్రతలు, వ్యవసాయ ఉత్పత్తుల ధరల సంబంధం పటిష్ఠంగా మారింది. త్వరగా పాడయ్యే పండ్లు, కూరగాయల ధరలు, వేడికీ మధ్య సంబంధం 2014లో 20% ఉండగా ఇప్పుడు 60కి చేరింది. జలాశయాల్లో నీటిని బట్టి ధరల పెరుగుదలను అంచనా వేసే పరిస్థితి ఇప్పుడు లేదు’ అని పేర్కొంది.
Similar News
News November 5, 2025
‘Money Heist’ ప్రేరణతో ₹150 కోట్ల దోపిడీ.. చివరికి..

థ్రిల్లర్ సిరీస్ ‘Money Heist’ ప్రేరణతో ₹150 కోట్లు దోచుకుంది ఢిల్లీకి చెందిన గ్యాంగ్. నిందితులు అర్పిత్(ప్రొఫెసర్), ప్రభాత్(అమాండా), అబ్బాస్(ఫ్రెడ్డీ) తమ పేర్లను సిరీస్‌లో మాదిరి మార్చుకున్నారు. SMలో పలు గ్రూపులు ఏర్పాటు చేసి స్టాక్ మార్కెట్ టిప్స్ ఇచ్చారు. తర్వాత హై రిటర్న్స్ ఇస్తామని నమ్మించి ₹కోట్లు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు 2 రాష్ట్రాల్లో దాడులు చేసి వారిని పట్టుకున్నారు.
News November 5, 2025
ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటల లోపు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, MBNR, RR, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మీ ఏరియాలో వర్షం కురుస్తోందా?
News November 5, 2025
రేవంత్, కేసీఆర్‌పై కిషన్ రెడ్డి ఫైర్

TG: ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్ ఏ ముఖం పెట్టుకొని జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడుగుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎర్రగడ్డలో ప్రచారం సందర్భంగా రేవంత్, KCRపై ఆయన ఫైర్ అయ్యారు. ‘తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు అడిగితే రేవంత్ ఫ్రీ బస్సు అంటున్నారు. అటు కేసీఆర్ పాలనలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదు కానీ ఆయన కుటుంబీకులు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు’ అని మండిపడ్డారు.


