News August 30, 2024
మైగ్రేషన్‌పై వచ్చిన విద్యార్థులను తిరిగి పంపిన నవోదయ

నిజాంసాగర్ మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఉత్తరప్రదేశ్‌లోని మధుర నవోదయ విద్యాలయం నుంచి తొమ్మిదో తరగతి చదివేందుకు వచ్చిన మైగ్రేషన్ విద్యార్థులను తిరిగి మధురకు పంపించారు. వాతావరణం భాష సహకరించక పోవడంతో ఏడుగురు బాలికలను, 15 మంది బాలురు లను తిరిగి మధుర నవోదయ విద్యాలయానికి పంపుతున్నట్లు ప్రిన్సిపల్ సత్యవతి తెలిపారు. ఇక్కడ విద్యార్థులు అక్కడికి అక్కడ విద్యార్థులు ఎక్కడికి వెళ్లడం సహజమన్నారు.
Similar News
News January 11, 2026
నిజామాబాద్: మందు బాబులపై ఉక్కుపాదం..!

NZB జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 5 రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో దొరికిన 232 మందిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రూ. 22.40 లక్షల జరిమానా విధించింది. వీరిలో 6గురికి జైలు శిక్ష పడింది. ‘ఒక్కసారి దొరికితే రూ.10 వేల జరిమానా’ తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం, పండుగ వేళల్లో విందులు చేసుకునే వారు వాహనాలు నడపరాదని పోలీసులు సూచిస్తున్నారు.
News January 11, 2026
నిజామాబాద్ జిల్లా పద్మశాలి కాలమానిని ఆవిష్కరణ

పద్మశాలి భవనంలో పద్మశాలి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ సభ్యుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాలమానిని – 2026ను సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు చౌకే వరప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఐక్యతకు, సంక్షేమానికి సంఘం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆసమ్ నవీన్, కోశాధికారి బాస దేవిదాస్, భూమేశ్వర్, రుద్ర గణపతి, భోజదాస్ పాల్గొన్నారు.
News January 11, 2026
ఆర్మూర్: దంపతుల ఆత్మహత్యాయత్నం

ఆర్మూర్ శివారులో శనివారం సాయంత్రం దంపతులు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ మండలం పడిగేలా గ్రామం వడ్డెర కాలనికి చెందిన రవితేజ, భార్య శోభ పట్టణ శివారులోని ఓ వెంచర్‌లో విషం తాగి ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.


