News August 30, 2024

మంచిర్యాల: PACS ఉద్యోగి సస్పెండ్

image

మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి పెంట సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. PACSలో రైతులకు తెలియకుండానే వారి పేరిట రుణాలు తీసుకొని అక్రమాలకు పాల్పడ్డారని, రుణాలు, నిధులు, ఎరువుల విక్రయాల నగదు సొంతానికి వాడుకున్నారని వెలుగులోకి వచ్చింది. అధికారులు కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. దీంతో జిల్లా సహకార శాఖ అధికారి సంజీవరెడ్డి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

Similar News

News September 16, 2025

ADB: వరద ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే ఉపశమనం కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి మున్సిపాలిటీ, నీటిపారుదల శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వరదలు ప్రభావితం చేసిన ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత పరిష్కారాల ద్వారా తక్షణమే చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా చూసేందుకు పనులు చేపట్టాలని సూచించారు.

News September 16, 2025

ADB: కాంగ్రెస్ గూటికి మాజీ నేతలు

image

TPCC అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పలువురు మాజీ నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇందులో మాజీ TPCC ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా వారు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.

News September 16, 2025

ADB: మొదలై వెంటనే ముగిసిన ఓ తల్లి విషాద గాథ..!

image

సిరికొండ మండలం బీంపూర్‌కు చెందిన తోడసం ఏత్మ భాయి(20) ప్రసవం తర్వాత మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈనెల 12న పురిటి నొప్పులతో ఆమెను ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, బాలుడికి జన్మనిచ్చింది. 14వ తేదీన డిశ్చార్జ్ అయ్యాక తీవ్రమైన తలనొప్పి రావడంతో 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.