News August 30, 2024

ఏపీలో తెలంగాణ తరహా మద్యం విధానం?

image

APలో తెలంగాణ తరహా మద్యం విధానమే అమలు చేసేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేటుకే అప్పగించనుండగా, దరఖాస్తులకు రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజు విధించే ఆలోచనలో ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మద్యం విధానాలపై కమిటీ అధ్యయనం చేసింది. SEPలో మద్యం విధానం ఖరారుతో పాటు దరఖాస్తులు స్వీకరించి లైసెన్సులు అందజేసే అవకాశముంది. OCT 1నాటికి కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉంది.

Similar News

News January 8, 2026

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం

image

దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను జనవరి 17న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గువాహటి-కోల్‌కతా రూట్‌లో 18 నుంచి పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి. 16 కోచ్‌లు, 823 సీట్లు కలిగిన ఈ ట్రైన్‌లో విమాన తరహా సౌకర్యాలు, ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. మధ్యతరగతి ప్రయాణికుల కోసం టికెట్ ధరలు రూ.2,300-3,600 మధ్య నిర్ణయించారు. గంటకు 180 KM వేగంతో దూసుకెళ్లనుంది.

News January 8, 2026

ధనుర్మాసం: ఇరవై నాలుగో రోజు కీర్తన

image

ఈ పాశురం కృష్ణుని గాథలు, గుణాన్ని కొనియాడుతోంది. రావణుని గెలిచిన రాముడికి, కృష్ణుడికి గోపికలు మంగళాశాసనాలు పలుకుతున్నారు. ‘గోవర్ధన గిరిని ఎత్తి గోకులాన్ని రక్షించిన నీ కరుణకు, శత్రువులను చెండాడు నీ సుదర్శన చక్రానికి జయం కలుగుగాక’ అని కీర్తిస్తున్నారు. ‘స్వామి! నీ వీరగాథలను స్తుతిస్తూ, మా నోముకు కావాల్సిన పరికరాలను ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు’ అని గోపికలు వేడుకుంటున్నారు. <<-se>>#DHANURMASAM<<>>

News January 8, 2026

కృత్రిమ ఊపిరితిత్తులు.. IITH పరిశోధనలు

image

ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఐఐటీ హైదరాబాద్ ఓ శుభవార్త అందించింది. కృత్రిమ ఊపిరితిత్తుల అభివృద్ధి దిశగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపింది. జర్మనీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్‌తో కలిసి ఈ పరిశోధనలు చేయనుంది. అవయవ మార్పిడి అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యంగా IIT హైదరాబాద్ పని చేస్తోంది. విజయవంతమైతే త్వరలోనే ఆర్టిఫీషియల్ లంగ్స్ అందుబాటులోకి రానున్నాయి.