News August 30, 2024

కర్నూలు: మిరపకాయల లోడు లారీ బోల్తా

image

పత్తికొండ నియోజకవర్గం అటికెలగుండులోని బస్టాండ్ సమీపాన కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారిపై వేకువజామున బళ్లారికి ఒట్టి మిరపకాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీ వేగంగా వెళ్తుండగా కుక్క అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేయడం వల్ల అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.

Similar News

News November 11, 2025

గవర్నర్ కర్నూలు పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

గవర్నర్ డాక్టర్ అబ్దుల్ నజీర్ కర్నూలు పర్యటన ఖరారయింది. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 12న కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయ 4వ స్నాతకోత్సవానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం నగరంలోని మాంటిస్సోరి విద్యా సంస్థల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఆయన రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌తో కలిసి పాల్గొననున్నారు.

News November 11, 2025

తెలంగాణలో యాక్సిడెంట్.. కర్నూలు వాసి మృతి

image

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలులోని ఆర్ఆర్ నగర్‌కు చెందిన ఎన్. రఘు(43) మృతి చెందారు. చిలుకూరు మిట్స్ కాలేజీ సమీప హైవేపై సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సత్తుపల్లికి సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ, కోదాడ నుంచి హుజూర్నగర్ వెళ్తున్న బొలెరో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ రఘు మృతి చెందగా, పలువురు గాయాలపాలయ్యారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

News November 11, 2025

ఢిల్లీలో పేలుడు.. అప్రమత్తమైన కర్నూలు పోలీసులు

image

ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు నేపథ్యంలో కర్నూల్ వ్యాప్తంగా అప్రమత్తతా చర్యలు ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. కర్నూలు, గుత్తి పరిధిలోని పెట్రోల్ బంకులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్ గేట్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించారు.