News August 30, 2024

ఉరవకొండ డిగ్రీ ప్రభుత్వ కళాశాల మరో ఘనత

image

ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరో ఘనత సాధించింది. న్యాక్ ‘A’ గ్రేడ్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. ఈ ఘనత సాధించడానికి కృషి చేసిన కళాశాల భోదన, భోదనేతర సిబ్బందికి, విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. ‘A’ గ్రేడ్ రావడం కళాశాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.

Similar News

News September 15, 2025

గుత్తి: 5 టన్నుల టమాటాలు పారబోశారు..!

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో టమాటా ధరలు రోజు రోజుకు పతనం అవుతున్నాయి. కనీసం ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. గుత్తికి చెందిన రైతులు 500 బాక్సులను మార్కెట్‌కు తీసుకు వచ్చారు. కిలో రూ.5, రూ.3 మాత్రమే పలకడంతో ఇలా హైవే పక్కన టమాటాలను రైతులు పారబోశారు.

News September 15, 2025

అనంత: పోలీస్ గ్రీవెన్స్‌కు 121 అర్జీల రాక

image

అనంతపురం జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే)కు అనూహ్య స్పందన లభించినట్లు SP జగదీశ్ పేర్కొన్నారు. మొత్తం 121 అర్జీలు వచ్చాయని వెల్లడించారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, రస్తా తగాదాలపై వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని SP హామీ ఇచ్చారు. కలెక్టరేట్ గ్రీవెన్స్ డేకు 334 అర్జీలు వచ్చాయని జేసీ శివ్ నారాయణ శర్మ తెలిపారు.

News September 15, 2025

ఇంజినీర్లకు దారి చూపిన గురువు!

image

అనంతపురం JNTUలో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సుదర్శన రావు ఎంతో మంది యువకులను ఉత్తమ ఇంజినీర్లుగా తీర్చిదిద్దారు. ఆయన గతంలో AEE ఉద్యోగం వదిలేసి టీచింగ్‌ను ఎంచుకున్నారు. తన అసాధారణమైన బోధనతో ఎంతో మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చారు. ఆయన స్టూడెంట్స్ AE, AEEలుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇండియాలోని బెస్ట్ టీచర్లలో ఆయన ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.
#EngineersDay2025