News August 30, 2024
TUలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘ప్లేస్మెంట్ డ్రైవ్’

తెలంగాణ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో హెటిరో డ్రగ్స్ హైదరాబాద్ కంపెనీవారు విభాగాధిపతి డాక్టర్ ఏ నాగరాజు పర్యవేక్షణలో విద్యార్థులకు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో పలువురు విద్యార్థులు అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై మౌఖిక పరీక్షకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అధ్యాపక సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎం యాదగిరి ప్రిన్సిపాల్, విభాగపు అధ్యాపకులు పాల్గొన్నారు.
Similar News
News December 31, 2025
NZB: అందరికీ విజయాలు కలగాలి: సీపీ

ప్రజలందరూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా పోలీసులకు సహకరిస్తూ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని సీపీ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ ప్రజలందరూ ఎలాంటి అభద్రతాభావంతో లేకుండా సుఖశాంతులతో ఉండాలని పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ విజయాలు కలగాలన్నారు.
News December 31, 2025
NZB: జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: కలెక్టర్

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి శుభాకాంక్షలు తెలిపారు. 2026వ సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలతో ముందుకు సాగాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలతో ముందుకు సాగాలని సూచించారు.
News December 31, 2025
ఏటీఎంల భద్రతపై నిజామాబాద్ సీపీ సమీక్ష

జిల్లాలో ATM దొంగతనాల నేపథ్యంలో సీపీ సాయి చైతన్య బ్యాంక్ మేనేజర్లతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏటీఎంలో 30 రోజుల బ్యాకప్‌తో కూడిన సీసీ కెమెరాలు, అలారం, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని, అనుమానాస్పద కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించి సమన్వయంతో నేరాలను అరికట్టాలని సూచించారు.


