News August 30, 2024

BJP – LJP మధ్య విభేదాలు.. స్పందించిన చిరాగ్ పాస్వాన్

image

BJP- LJP(RV) మ‌ధ్య విభేదాలు తలెత్తినట్లు వస్తున్న క‌థ‌నాల‌ను కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తోసిపుచ్చారు. ప్ర‌ధాని మోదీపై త‌న‌కున్న ప్రేమ చెక్కుచెద‌ర‌నిద‌ని, ఆయ‌న‌తో ఉన్న అనుబంధం దృఢ‌మైన‌ద‌ని చిరాగ్ పేర్కొన్నారు. తన అభిప్రాయాలు ఎల్లప్పుడూ ప్రభుత్వ వైఖరికి అద్దంపడతాయన్నారు. లేట‌ర‌ల్ ఎంట్రీలు, వ‌క్ఫ్ బిల్లుపై LJP అభ్యంత‌రాలు లేవ‌నెత్త‌డంతో 2 పార్టీల మ‌ధ్య విభేదాలు రాజుకున్న‌ట్టు వార్తలు వ‌చ్చాయి.

Similar News

News December 28, 2025

కోటీశ్వరుడు.. ర్యాపిడో డ్రైవరయ్యాడు

image

కరోనా కష్టాలు ఒక కోటీశ్వరుడిని ర్యాపిడో డ్రైవర్‌గా మార్చేశాయి. ఒకప్పుడు ₹కోట్లలో వ్యాపారం చేసిన ఆయన కొవిడ్ వల్ల ఏకంగా ₹14 కోట్లు నష్టపోయారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఉపాధి కోసం ర్యాపిడో నడుపుతున్నారు. Amity యూనివర్సిటీలో చదివిన అతడు ఒక ప్రయాణికుడితో తన బాధ పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న కథ నెట్టింట వైరలవుతోంది. ‘ఇప్పటికీ దేవుడిపై నమ్మకం ఉంది. ఓటమిని ఒప్పుకోను’ అంటున్న ఆయన ధైర్యం కదిలిస్తోంది.

News December 28, 2025

Silver.. సారీ..! Stock లేదు!

image

వెండి పరుగులతో పెట్టుబడి కోసం బిస్కెట్స్‌కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. కానీ కొందామని షాపులకు వెళ్తున్న కస్టమర్లకు నిరాశే ఎదురవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ షాపుల్లో సిల్వర్ బార్స్ లేవనే సమాధానం వస్తోంది. ఒకవేళ అక్కడక్కడా ఉన్నా 10గ్రా, 15g, 20g బార్స్ తప్ప వందలు, వేల గ్రాముల్లో లేవని చెబుతున్నారు. ఆర్డర్ పెడితే 4-7 రోజులకు వస్తుందని, ఆరోజు ధరకే ఇస్తామంటున్నారు. మీకూ ఇలా అయిందా? కామెంట్.

News December 28, 2025

EDలో 75పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(<>ED<<>>)లో 75 కాంట్రాక్ట్ లీగల్ కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. LLB/LLM ఉత్తీర్ణతతో పాటు 3ఏళ్ల పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి జీతం నెలకు రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://enforcementdirectorate.gov.in