News August 30, 2024

కాకినాడ GGHలో ఒక పడకపై ఇద్దరు రోగులు

image

కాకినాడ జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్నాయి. దీంతో 1,155 పడకలున్న కాకినాడ ప్రభుత్వాసుపత్రికి 2వేల మందికి పైగా వచ్చి చేరారు. దీంతో కొన్ని వార్డుల్లో ఒక్కో మంచం మీద ఇద్దరిని పడుకోబెట్టగా, చివరకు నేలమీద కూడా పడుకోబెట్టి చికిత్స చేయాల్సి వస్తోంది. జ్వరాలతో ఎక్కువ కేసులు రావడమే ఈ పరిస్థితికి కారణమని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.లావణ్య కుమారి చెప్పారు.

Similar News

News August 23, 2025

గణేశ్ మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ

image

వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు పొందాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ స్పష్టం చేశారు. అయితే, ఈ అనుమతుల కోసం ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. గణేశ్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నిబంధనలను ఆయన శుక్రవారం ప్రకటించారు. విగ్రహాల వద్ద తాత్కాలిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

News August 23, 2025

ధవళేశ్వరం బ్యారేజీని పరిశీలించిన ఐజీ

image

గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ శుక్రవారం దవళేశ్వరం కాటన్ బ్యారేజీని సందర్శించారు. జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్‌తో కలిసి వరద పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నందున బ్యారేజీ వద్ద సందర్శకులను నియంత్రించాలని, పోలీసు భద్రతను పెంచాలని అధికారులను ఐజీ ఆదేశించారు. సీఐ టి. గణేశ్ ఉన్నారు.

News August 23, 2025

కాకినాడ: స్వర్ణాంధ్రాపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

ఆగస్ట్ 23న జరగనున్న స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంపై కలెక్టర్ పి.ప్రశాంతి శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా అన్ని విభాగాధిపతులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈసారి ‘పరిశుభ్రత’తో పాటు వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు.