News August 30, 2024
అందరికీ గుడ్ న్యూస్ చెప్పనున్న GST కౌన్సిల్!

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను GST నుంచి మినహాయించే అవకాశం ఉంది. దీనిపై డిమాండ్లు వెల్లువెత్తడంతో సెప్టెంబర్ 9న జరగనున్నGST కౌన్సిల్ మీట్ ఈ మేరకు మినహాయింపు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వంపై రూ.200 కోట్ల భారం పడుతుందని అంచనా. ఇక పెట్టుబడి ఆధారిత బీమా పాలసీలకు పన్ను మినహాయింపు ఉండబోదని సమాచారం. ఆరోగ్య బీమాలపై కూడా పన్ను తగ్గింపు విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News February 24, 2025
భారత జట్టుకు ప్రముఖుల విషెస్

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమ్ ఇండియాకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ గొప్ప విజయాన్ని అందుకుందని AP CM చంద్రబాబు అన్నారు. జట్టుకు TG CM రేవంత్ కంగ్రాట్స్ తెలియజేశారు. అద్భుతమైన మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించడం మరచిపోలేని అనుభూతి అని చిరంజీవి, మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.
News February 24, 2025
మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆల్ట్‌మాన్, ఒలివర్

ఓపెన్ ఏఐ CEO సామ్ ఆల్ట్‌మాన్, అతని పార్ట్‌నర్ ఒలివర్ ముల్హెరిన్ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆల్ట్‌మాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ‘అతడు కొంతకాలం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంటాడు. అతడిని జాగ్రత్తగా చూసుకోవడం ఆనందంగా ఉంది. ఇంత ప్రేమను నేనెప్పుడూ అనుభవించలేదు’ అని పేర్కొన్నారు. గే అయిన ఆల్ట్‌మాన్ 2024లో ఒలివర్‌ను వివాహమాడారు.
News February 24, 2025
తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తా: సమంత

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సాయిపల్లవి, నజ్రియా, అలియా భట్ వంటి హీరోయిన్లు రాక్ స్టార్లు అని హీరోయిన్ సమంత చెప్పారు. ఇన్‌స్టాలో అభిమానుల ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. నెగటివ్ ఆలోచనలను అధిగమించేందుకు రెగ్యులర్‌గా మెడిటేషన్ చేస్తానని తెలిపారు. తెలుగులో సినిమాలు చేయాలని ఓ టాలీవుడ్ ఫ్యాన్స్ కోరగా తప్పకుండా మళ్లీ వస్తానని బదులిచ్చారు. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ చూసినట్లు పేర్కొన్నారు.