News August 30, 2024
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు.. కాంగ్రెస్ నేతకు ఢిల్లీ కోర్టు షాక్

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌పై హత్య, అల్లరి మూకలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం వంటి అభియోగాలు మోపాలని ఢిల్లీ కోర్టు CBIను ఆదేశించింది. ఢిల్లీలోని పుల్ బంగశ్ గురుద్వారా వద్ద ఠాకూర్ సింగ్,బాదల్ సింగ్, గురుచరణ్ సింగ్ హత్య కేసులో 9 రకాల అభియోగాలను సెప్టెంబర్ 13న నమోదు చేస్తారు. దీనిపై టైట్లర్ స్పందించాల్సి ఉంటుంది. ఆయన పాత్రపై ఆధారాలున్నాయని CBI తెలిపింది.
Similar News
News September 18, 2025
ఆహా! ఎంత అద్భుతమైన శ్లోకం (2/2)

ఈ శ్లోకాన్ని ఎడమ నుంచి చదివితే ‘ఎవరైతే సీతను కాపాడారో, ఎవరి చిరునవ్వు అందంగా ఉంటుందో, ఏ అవతారం విశేషమైనదో, ఎవరినుంచైతే దయ, అద్భుతమూ ప్రతిచోట వర్షిస్తుందో అట్టి రాముడికి నమస్కరిస్తున్నాను’ అని అర్థం వస్తుంది. కుడి వైపు నుంచి చదివితే ‘యాదవ కులంలో పుట్టిన, సూర్యచంద్రులకు ప్రాణాధారమైన, పూతనను సంహరించిన, సకల సృష్టికి ఆత్మయైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను’ అనే అర్థం వస్తుంది. అద్భుతమైన శ్లోకం కదా!
News September 18, 2025
రాబోయే 3 గంటల్లో వర్షం: APSDMA

రాబోయే 3 గంటల్లో కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ వాన కురుస్తుందని తెలిపింది. అటు TGలో HYD, గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, MBNR, NLG, కామారెడ్డి, మెదక్, NRPT జిల్లాల్లో ఇవాళ రాత్రి వర్షం పడొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
News September 18, 2025
సర్కారు బడుల్లో నర్సరీ, LKG, UKG.. ప్రభుత్వానికి సిఫార్సు

TG: ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల వయసును ఆరేళ్లకు (ప్రస్తుతం 5 ఏళ్లు) పెంచాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సర్కారు బడుల్లోనూ నర్సరీ, LKG, UKGని ప్రవేశపెట్టాలని సూచించింది. ప్రైవేట్ పాఠశాలల్లో మూడేళ్ల నుంచే పిల్లలను చేర్చుకుంటున్నందున, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడానికి ఇష్టపడటం లేదని కమిషన్ గుర్తించి ఈ సిఫార్సులు చేసింది.