News August 30, 2024
7 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ప్రకటించిన మంత్రి తుమ్మల

7 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్ పర్సన్లను, వైస్ చైర్ పర్సన్లను, నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మహబూబ్ నగర్, వెలగటూరు, గాంధరి , సదాశివనగర్, ఎల్లారెడ్డి, నేలకొండపల్లి, మద్దులపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 7, 2025
కూసుమంచి: పంట నష్టం నమోదుకు పడవ ప్రయాణం

కూసుమంచి మండలం పాలేరు క్లస్టర్ ఏఈవో సాయిరాం తన వృత్తి నిబద్ధతను చాటారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించేందుకు దారి లేకపోవడంతో, ఆయన ఓ మత్స్యకారుని సహాయంతో పడవపై ప్రయాణించారు. పంట నష్టాన్ని నమోదు చేసి, రైతులకు న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ సాహసం చేసిన ఏఈవో సాయిరామ్పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి
News November 6, 2025
పీఎం శ్రీ నిధులు సమర్థవంతంగా వినియోగించాలి: ఇన్చార్జ్ కలెక్టర్

పీఎం శ్రీ నిధులను అధికారులు సమర్థవంతంగా వినియోగించాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో నిధుల వినియోగంపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎంపికైన 28 పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, క్రీడా అభివృద్ధి, యూత్ ఎకో క్లబ్ ఏర్పాటు, పరిశ్రమల విజిట్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
News November 6, 2025
పోష్, పోక్సో చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ఇన్చార్జ్ కలెక్టర్

పోష్ చట్టం-2013, పోక్సో చట్టం-2012లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ శ్రీజ అన్నారు. గురువారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగ స్థలాల్లో మహిళల రక్షణకు పోష్ చట్టం పొందించబడిందని, దీని కింద 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని సూచించారు. పిల్లల రక్షణకు పోక్సోలో కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు.


