News August 30, 2024
Gmailలో కొత్త AI ఆప్షన్.. ఇక సమాచారం క్షణాల్లో తెలుసుకోవచ్చు
ఆండ్రాయిడ్ వర్క్ స్పేస్ యూజర్ల కోసం గూగుల్ Gmailలో కొత్త AI ఫీచర్‌ను తీసుకొచ్చింది. జెమిని-పవర్డ్ Gmail Q&Aని అప్‌డేట్ చేసింది. దీని ద్వారా యూజర్లు తమ ఇన్‌బాక్స్‌లోని ఈమెయిల్స్ నుంచి నిర్దిష్ట సమాచారాన్ని గుర్తించడానికి Gmailలోనే జెమినిని ప్రాంప్ట్ చేయవచ్చు. కావాల్సిన సమాచారం ఏ మెయిల్‌లో ఉన్నది గుర్తించి మనకు అందిస్తుంది. యాప్‌లో కుడివైపున బ్లాక్ జెమిని స్టార్‌పై ట్యాప్ చేసి వాడుకోవచ్చు.
Similar News
News January 31, 2025
టీమ్ ఇండియాతో ఫ్రెండ్లీగా ఉండొద్దు.. పాక్ ఆటగాళ్లకు హెచ్చరిక
ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచుల్లో భారత ఆటగాళ్లతో స్నేహంగా ఉండొద్దని పాక్ మాజీ ఆటగాడు మోయిన్ ఖాన్ తమ క్రికెటర్లను హెచ్చరించారు. ‘ఈ మధ్యకాలంలో మనవాళ్ల వైఖరి నాకు అర్థం కావట్లేదు. భారత బ్యాటర్లు క్రీజులోకి రాగానే వెళ్లి వారి బ్యాట్లను చెక్ చేయడం, ఫ్రెండ్లీగా మాట్లాడటం వంటివి చేస్తున్నారు. గౌరవం ఇవ్వడం వరకూ ఓకే కానీ ఈ అతి స్నేహం దేనికి?’ అని ప్రశ్నించారు. వచ్చే నెల 23న దుబాయ్‌లో భారత్-పాక్ తలపడనున్నాయి.
News January 31, 2025
16,347 టీచర్ పోస్టులు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
AP: రాష్ట్రంలో రాత్రికి రాత్రే అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయని చెప్పట్లేదని CM CBN తెలిపారు. గాడితప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. MLC ఎన్నికలు ముగియగానే 16,347 టీచర్ పోస్టులకు DSC నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని కూటమి నేతలకు సూచించారు.
News January 31, 2025
‘పోలవరం’ పూర్తికి కట్టుబడి ఉన్నాం: రాష్ట్రపతి
పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణానికి తాజాగా రూ.12వేల కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ సమావేశాల ప్రారంభ ప్రసంగంలో తెలిపారు. అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలందరికీ అందాలనేదే తమ లక్ష్యమన్నారు. భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.