News August 31, 2024

హైదరాబాద్‌లో మిలాద్ ఉత్సవాలు వాయిదా

image

హైదరాబాద్‌లో మిలద్-ఉన్-నబి ఉత్సవాలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 16వ తేదీకి బదులుగా అదే నెల 19వ తేదీన జరుగనున్నాయి. ఈ మేరకు మిలాద్ వేడుకల నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి వేడుకలను దృష్టిలో ఉంచుకుని మిలాద్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గణేష్ చతుర్థి, మిలాద్-ఉన్-నబీ పండగలు కలిసి వచ్చినందున వాటి ఏర్పాట్లపై సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

Similar News

News September 14, 2025

HYD: విద్యార్థినుల ఫోన్ నంబర్లు వారికెలా వచ్చాయి?

image

మహిళా వర్సిటీ విద్యార్థినులను వేధిస్తున్న ముగ్గురు యువకులను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ముగ్గురికీ విద్యార్థినుల ఫోన్ నంబర్లు ఎలా వచ్చాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిందితుల్లో ఒకరు కార్ డ్రైవర్, మరొకరు హౌస్ కీపింగ్ బాయ్, మరొకరు డెలివరీ బాయ్. అంతమంది నంబర్లను ఎలా సేకరించారనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు.

News September 14, 2025

ఖైరతాబాద్: ‘ఈ నెల 24న బీసీ బతుకమ్మ నిర్వహిస్తాం’

image

ఈ నెల 24న ట్యాంక్ బండ్‌పై బీసీ బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తామని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వేలాది మంది మహిళలు బీసీ బతుకమ్మ వేడుకలో పాలుపంచుకుంటారన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని కోరారు.

News September 14, 2025

HYD: ఈ ఫార్ములా కేస్.. విజిలెన్స్ కమిషన్ పరిధిలోకి బాల్

image

గత ప్రభుత్వం HYDలో నిర్వహించిన ఈ ఫార్ములా కార్ రేసులో భారీ అవినీతి జరిగిందని అవినీతి నిరోధక శాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి తదుపరి విచారణకు అనుమతివ్వాలని కోరింది. అయితే ప్రభుత్వం ఈ రిపోర్టును విజిలెన్స్ కమిషన్‌కు పంపి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయం కోరింది. విజిలెన్స్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ కేసుపై చర్యలు తీసుకోనుంది.