News August 31, 2024
నీటిపారుదల సమీక్ష సమావేశంలో మంత్రులు

భువనగిరిలో పార్లమెంటు నియోజకవర్గం నీటిపారుదల శాఖ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పది సంవత్సరాలుగా బునాదిగాని కాలువ, పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువలపై వివక్ష చూపించారని మండిపడ్డారు.
Similar News
News January 11, 2026
నల్గొండ: గంజాయి విక్రయిస్తున్న వారి అరెస్టు

పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న వారిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్న సయ్యద్ మజీద్ హుస్సేన్, సోహెల్‌ను టాస్క్‌ఫోర్స్, నల్గొండ రూరల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌తో పట్టుకున్నారు. నిందితుల నుంచి నాలుగున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
News January 11, 2026
నల్గొండ: గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

పట్టణంలోని రాంనగర్లో SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ హౌస్ వైరింగ్ కోర్సులో 30 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు సియాజీ రాయ్ తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామన్నారు. ఉమ్మడి నల్గొండకు చెందిన 19 నుంచి 45 ఏళ్లలోపు పురుషులు అర్హులని, ఆసక్తి గల వారు జనవరి 18 లోపు సంస్థలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9701009265 సంప్రదించాలన్నారు.
News January 11, 2026
NLG: లక్ష్యానికి దూరంగా.. మీనం..!

నల్గొండ జిల్లాలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియపై మత్స్యకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం ముగిసినా నిర్దేశిత లక్ష్యంలో 80 శాతం పూర్తికాకపోవడం గమనార్హం. జూలైలోనే జలాశయాలు నిండినా, నిధుల విడుదల ఆలస్యమవడంతో పంపిణీలో జాప్యం జరిగింది. ప్రభుత్వం స్పందించి మిగిలిన కోటాను పూర్తి చేయడంతో పాటు, నాణ్యమైన చేప పిల్లలను అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


