News August 31, 2024
విద్యాసాగర్ నాపై కక్ష కట్టారు: నటి జెత్వాని
AP: వేధింపుల <<13969654>>కేసులో<<>> విచారణకు హాజరైన నటి జెత్వాని మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. తనపై అక్రమ కేసులు పెట్టారని, అనేక రకాలుగా వేధించారని చెప్పారు. విద్యాసాగర్ తనపై కక్ష కట్టారని, తనతో పాటు కుటుంబసభ్యులు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. 2015లో విద్యాసాగర్ ప్రవర్తనతో పెళ్లికి నిరాకరించానని తెలిపారు. పోలీసులకు అన్ని సాక్ష్యాలు, ఆధారాలు సమర్పించానన్నారు.
Similar News
News January 15, 2025
భారత్ ఘన విజయం
ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. 436 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఐరిష్ జట్టును 131 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో 304 రన్స్ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. వన్డేల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. ఇండియా బౌలర్లలో దీప్తి 3, తనూజ 2, సాధు, సయాలి, మిన్నూ తలో వికెట్ పడగొట్టారు. మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.
News January 15, 2025
ఆకట్టుకుంటోన్న స్పెషల్ బాబాలు
మహా కుంభమేళాకు వచ్చిన స్పెషల్ బాబాలు ఆకట్టుకుంటున్నారు. అందులో ఐఐటియన్ బాబా, 14 ఏళ్లుగా ఒక చేయిని పైకి ఎత్తి అలాగే ఉంచేసిన రాధే పురీ బాబా, పురాతన కారులో వచ్చిన అంబాసిడర్ బాబా, తలపై వరి, మిల్లెట్ మొక్కలు పెంచే అనాజ్ వాలే బాబా, చాయ్ వాలే బాబా, 32 ఏళ్లుగా స్నానం ఆచరించని 3.8 ఫీట్ బాబా, తలపై 2 లక్షల రుద్రాక్షలు ధరించిన గీతానంద గిరి బాబా, తలపై పావురం కలిగి ఉన్న మహంత్ రాజ్‌పురీ జీ మహారాజ్ ఉన్నారు.
News January 15, 2025
నామినేషన్ వేసిన కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ వేశారు. తన భార్య, పార్టీ నేతలు, అభిమానులు వెంట రాగా ఆయన నామినేషన్ ఫైల్ చేశారు. త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మూడుసార్లు సీఎంగా చేసిన ఆయన లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ కావడంతో ఇటీవలే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.