News August 31, 2024

నేడు పులివెందులకు జగన్

image

AP: నేటి నుంచి పులివెందులలో మాజీ సీఎం జగన్ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ఉదయం 11 గంటలకు ఆయన కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన పార్టీ నేత చంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. మూడు రోజులు నియోజకవర్గ నేతలకు అందుబాటులో ఉండనున్నారు. వచ్చే నెల 4న విదేశాలకు వెళ్తారని సమాచారం.

Similar News

News February 1, 2025

వారికి టెన్త్ విద్యార్హతతో ప్రమోషన్లు

image

TG: అంగన్‌వాడీల్లో ఆయాలు టీచర్లుగా ప్రమోట్ అయ్యేందుకు ఇంటర్ విద్య తప్పనిసరి అన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. 2022, AUG 1కి ముందు ఆయాలుగా నియమితులైన వారు 10th అర్హతతో టీచర్లుగా ప్రమోట్ అయ్యేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ఆయాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల సర్వీస్‌తో పాటు 45 ఏళ్ల లోపు వయసున్న వారికి ఇది వర్తించనుంది.

News February 1, 2025

అవును.. చైనా ల్యాబ్ నుంచే కొవిడ్ వచ్చింది: అమెరికా

image

చైనా ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటికి వచ్చినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని అమెరికా అధ్యక్ష కార్యాలయ కార్యదర్శి కరోలిన్ లెవిట్ ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ‘కొవిడ్ వైరస్ చైనా ల్యాబ్ నుంచి వచ్చిందని చాలా ఏళ్ల క్రితమే ట్రంప్ అన్నారు. అప్పట్లో అందరూ ఆయన్ను వెక్కిరించారు. కానీ ఆయన చెప్పింది వాస్తవం. దానికి సంబంధించిన సాక్ష్యాలు బైడెన్ హయాంలోనే లభించాయి. గత సర్కారు ఎందుకో వాటిని బయటపెట్టలేదు’ అని పేర్కొన్నారు.

News February 1, 2025

పన్ను వసూళ్లలో నంబర్‌వన్‌గా తెలంగాణ

image

TG: పన్ను వసూళ్లలో సొంత పన్నుల సొమ్ములు సగానికిపైగా ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో నిలిచినట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో సొంత పన్ను వసూళ్లు 88 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. అలాగే జల్ జీవన్ మిషన్‌ను వంద శాతం అమలు చేస్తున్న 8 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉన్నట్లు తెలిపింది. ఐటీ సేవలతో దేశంలో కర్ణాటక, తెలంగాణ ముందున్నాయని పేర్కొంది.