News August 31, 2024

విజృంభిస్తున్న వైరల్ ఫీవర్లు

image

APలో వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. 10రోజుల్లో సమారు 5లక్షల మంది బాధితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించారు. అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉండనుంది. గతేడాది కంటే ఈసారి బాధితుల సంఖ్య 20-30% ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ప్రతి ఇంట్లో ఒక రోగి ఉన్నారు. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ కేసులు బాగా పెరుగుతుండటంతో జ్వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News January 12, 2026

తొక్కిసలాట బాధ్యత టీవీకేది కాదన్న విజయ్!

image

కరూర్ <<17852847>>తొక్కిసలాట<<>>కు టీవీకేది బాధ్యత కాదని ఆ పార్టీ అధినేత విజయ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో CBI <<18836427>>ఆయన్ను<<>> 6 గంటలు విచారించింది. విషాదం తీవ్రత పెరగకుండా తాను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పారని సమాచారం. ‘విజయ్‌ను ప్రశ్నించడం ముగియలేదు. పండుగ నేపథ్యంలో వాయిదా వేయాలని ఆయన కోరారు. పొంగల్ తర్వాత ఆయన్ను మరోసారి పిలుస్తాం’ అని CBI వర్గాలు తెలిపాయి.

News January 12, 2026

మాజీ మంత్రి కన్నుమూత

image

AP: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కన్నుమూశారు. మెదడులో రక్తం గడ్డ కట్టే సమస్యతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి 4 సార్లు(1985, 89, 94, 99) టీడీపీ తరఫున పోటీ చేసి MLAగా గెలిచారు. ఎన్టీఆర్ హయాంలో 2 సార్లు మంత్రిగా పనిచేశారు. 2024 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

News January 12, 2026

VHT: పడిక్కల్ సరికొత్త చరిత్ర

image

కర్ణాటక ప్లేయర్ దేవదత్ పడిక్కల్ సరికొత్త చరిత్ర సృష్టించారు. విజయ్ హజారే ట్రోఫీలో రెండు సార్లు 700కు పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. 2021లో 737 రన్స్ చేయగా ప్రస్తుత సీజన్‌లో 721 రన్స్‌తో కొనసాగుతున్నారు. ఈ సీజన్‌లో నాలుగు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు చేశారు. ఓవరాల్‌గా ఈ జాబితాలో తమిళనాడు ప్లేయర్ జగదీశన్(830) ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఉన్నారు.