News August 31, 2024

శ్రీకాకుళం: రేపు అండర్ -9 చదరంగం పోటీలు

image

శ్రీకాకుళం జిల్లా చదరంగం అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల ఒకటో తేదీన అండర్-9 విభాగంలో బాలలకు చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు బగాది కిశోర్ తెలిపారు. 2015 జనవరి 1 తరువాత జన్మించిన క్రీడాకారులు అర్హులన్నారు. శ్రీకాకుళం నగరంలోని నానుబాల వీధిలోని చదరంగం శిక్షణ కార్యాలయానికి 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.

Similar News

News August 31, 2025

శ్రీకాకుళం: రేపు కలెక్టర్ గ్రీవెన్స్

image

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం ఉదయం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News August 31, 2025

టెక్కలి జిల్లా ఆసుపత్రిని వేధిస్తున్న సమస్యలు

image

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో రేడియాలజీ, చర్మవ్యాధులు, జనరల్ సర్జిన్ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసుపత్రికి స్టాఫ్ నర్సులు, జీడీఏలు కొరత అధికంగా వేధిస్తోంది. రోగులకు తాగునీరు కోసం ఏర్పాటు చేసిన ఆర్.ఓ ప్లాంట్ తరుచూ మరమ్మతులకు గురౌతుంది. డ్రైనేజీ సమస్యతో పాటు ప్రధానంగా బయోమెడికల్ వేస్ట్ భద్రపరిచేందుకు గదిలేదు. ఆసుపత్రిలో ఇంకేమైనా ప్రధాన సమస్యలు ఉన్నాయా ? అయితే COMMENT చేయండి.

News August 31, 2025

శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగావకాశాలు

image

శ్రీకాకుళం జిల్లా వయోజన విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 4 సూపర్‌వైజర్ పోస్టులకు సెప్టెంబర్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని DD అల్లు సోమేశ్వరరావు కోరారు. డిప్యుటేషన్ ప్రాతిపదికన ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల వయస్సు 45ఏళ్లు లోపు ఉండాలన్నారు. MRPగా కనీసం 10ఏళ్లు పనిచేసిన సెకండరీ గ్రేడ్ టీచర్లు అర్హులన్నారు.