News August 31, 2024

ఉమ్మడి తూ.గో. జిల్లాలో వర్షాలు

image

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని, మత్స్యకారుల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Similar News

News October 7, 2024

సామర్లకోటలో 8న మినీ జాబ్ మేళా

image

సామర్లకోట టీటీడీసీలో 8న (మంగళవారం) ఉదయం 10.గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి సంస్థ అధికారి శ్రీనివాస్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు, సీడన్ జేడీఎం కిరణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. వివిధ ఉద్యోగుల్లో పని చేసేందుకు పది, ఇంటర్, ఐటీఐ, ఫిట్టర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు.

News October 7, 2024

తూ.గో: TODAY TOP NEWS

image

*ఆలమూరు: గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
*పిఠాపురం: బ్యాంకు ఎలక్షన్‌లో కూటమి విజయం
*జాతీయ హ్యాండ్ బాల్ జట్టులో కోనసీమ కుర్రోడు
*కాకినాడ: అన్నదమ్ముల మధ్య ఆస్తి తగదా.. ఒకరు మృతి
*రావులపాలెం: కోడిగుడ్ల లారీ బోల్తా
*కాకినాడ: అచ్చంపేట జంక్షన్ వద్ద యాక్సిడెంట్
*కాకినాడ నుంచి ఈ నెల 15న అరుణాచలానికి బస్సు
*రాజమండ్రి: మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్
*ధవళేశ్వరం: 8 కాసుల బంగారు ఆభరణాలు చోరీ

News October 6, 2024

ఆలమూరు: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

image

ఆలమూరు మండలం చొప్పెల్ల పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని ఆలమూరు ఎస్సై అశోక్ ఆదివారం తెలిపారు. లాకులు దాటిన తర్వాత 40 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళ మృతదేహాన్ని గుర్తించడం జరిగిందన్నారు. పచ్చ రంగు జాకెట్, బిస్కెట్ కలర్ లంగా ధరించి ఉందన్నారు. ఎత్తు సుమారు 5.2 అడుగులు ఉంటుందని తెలిపారు. ఆమె వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.