News August 31, 2024

నేడు విశాఖ జిల్లాలోని పాఠశాలలకు సెలవు

image

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విశాఖ కలెక్టర్ హరీంధిర ప్రసాద్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. SHARE IT.

Similar News

News January 21, 2025

బొత్సకు హోం మంత్రి అనిత కౌంటర్

image

శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు హోం మంత్రి <<15209881>>అనిత కౌంటర్<<>> ఇచ్చారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రామతీర్థం ఘటనలో మాజీ మంత్రికి నిందితుడికి, సాక్షులకు తేడా తెలియడం లేదని విమర్శించారు. ఘటనలో సాక్షిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చామని స్పష్టం చేశారు. తప్పు చేయని వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు.

News January 21, 2025

విశాఖ మీదుగా వెళ్లే 8 రైళ్లకు అదనపు బోగీలు

image

విశాఖ మీదుగా వెళ్లే 8 రైళ్ళకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ తెలిపారు. జనవరి 22 నుంచి 12375/76 నకు ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్, మార్చ్ 25నుంచి 12835/36నకు రెండు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు శాశ్వతంగా పెంచనున్నారు. జనవరి 21నుంచి ఫిబ్రవరి 18వరకు 22603/04 నకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను, జనవరి 22 నుంచి ఫిబ్రవరి 19 వరకు 22605/06 నకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను పెంచనున్నారు.

News January 21, 2025

ఆ ముఠాలో పెద్ద తలకాయలు ఉన్నాయి: విశాఖ సీపీ

image

క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు విశాఖ సీపీ డా. శంఖబ్రత బాగ్చీ తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని విషయాలను పబ్లిక్‌గా చెప్పలేమన్నారు. ఇందులో పెద్ద తలకాయలు ఉన్నాయని వాళ్లను కచ్చితంగా పట్టుకుంటామన్నారు. ఇదే కేసులో ఓ హెడ్ కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేసి ఎంక్వైరీకి ఆదేశించామన్నారు.