News August 31, 2024
అనకాపల్లి జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు

అనకాపల్లి జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా జిల్లాలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ సెలవు ప్రకటించారు. కచ్చితంగా విద్యాసంస్థలు నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా సెలవు ప్రకటించామని పేర్కొన్నారు. ఎంఈఓ లు విద్యాసంస్థల మీద పర్యవేక్షణ చేయాలని సూచించారు.
Similar News
News February 13, 2026
గంగవరం పోర్టులో కనీసం బ్రేక్ వాటర్ నిర్మించండి: ఎమ్మెల్యే పల్లా

గంగవరం పోర్టు ఏర్పడిన తర్వాత ఇక్కడ జెట్టీ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. జెట్టీ లేక ఇక్కడి మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రస్తావించారు. కనీసం బ్రేక్ వాటర్‌ను అయినా నిర్మించి స్థానిక మత్స్యకారులను ఆదుకోవాలని ఆయన కోరారు.
News February 13, 2026
విశాఖ: బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

విశాఖ జిల్లాలోని ఎంజేపీ ఏపీ బీసీ గురుకులాల్లో 5వ తరగతి, 6-8 (బ్యాక్‌లాగ్), ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 4వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 12న 5వ తరగతికి, ఏప్రిల్ 19న మిగిలిన తరగతులకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయని గురుకులం ప్రిన్సిపల్ గుణుపూరు పురుషోధి తెలిపారు. మరిన్ని వివరాలకు www.mjpapbcwreis.pacfss.inను సందర్శించాలన్నారు.
News February 13, 2026
విశాఖలో అంతర్జాతీయ నౌకా దళ విన్యాసాలు.. పటిష్ఠ భద్రత

ఐఎఫ్ఆర్, మిలాన్ వేడుకల కోసం విశాఖలో 7,000 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాటు చేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. రాష్ట్రపతి, 75 దేశాల ప్రతినిధులు హాజరవుతున్న ఈ మహా వేడుక కోసం 64 డ్రోన్లు, ఆధునిక యాప్‌లతో నిఘా పెంచారు. తీర భద్రతను కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశామని, ప్రజలు అనుమానాస్పద సమాచారాన్ని 112 తెలియజేయాలని కోరారు.


