News August 31, 2024

భారీ వర్షాలు.. 2 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు. ఈమేరకు జిల్లాల విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల చేేశారు. వర్షాల నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా రాష్ట్రంలో నేడు అతిభారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

Similar News

News November 4, 2025

TODAY HEADLINES

image

* చేవెళ్లలో RTC బస్సును టిప్పర్ ఢీకొని 19 మంది మృతి.. రూ.7 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
* ఎన్ని అవాంతరాలు ఎదురైనా SLBC పూర్తి చేస్తాం: CM రేవంత్
* లండన్‌లో CM CBNతో హిందూజా గ్రూప్ ప్రతినిధుల భేటీ.. రూ.20వేల కోట్ల పెట్టుబడులకు ఓకే
* CII సమ్మిట్‌లో రూ.9.8 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు.. 7.5 లక్షల ఉద్యోగావకాశాలు: మంత్రి లోకేశ్
* WWC: ప్లేయర్లకు డైమండ్​ నెక్లెస్​ల బహుమతి

News November 4, 2025

దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్లు

image

AP: దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజేయనున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ‘రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు, టెన్త్ పాసై స్వయం ఉపాధితో జీవించే వాళ్లు, 18-45 ఏళ్లలోపు వయసు, 70% అంగవైకల్యం, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అర్హులు. ఈనెల 25లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి’ అని తెలిపారు.

News November 4, 2025

‘పెద్ది’ మూవీ అప్డేట్ ఇచ్చిన AR రహ్మాన్

image

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ నుంచి AR రెహమాన్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. రెహ్మాన్, బుచ్చిబాబు, మోహిత్ చౌహాన్ ఉన్న పిక్ షేర్ చేసి.. ‘ఏం ప్లాన్ చేస్తున్నారు?’ అని రామ్ చరణ్ ప్రశ్నించారు. అందుకు ‘చికిరి చికిరి.. చరణ్ గారు’ అని రెహమాన్ సమాధానమిచ్చారు. అంటే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కి రెడీ అవుతోందని చెప్పకనే చెప్పేశారు. అయితే రిలీజ్ ఎప్పుడో మాత్రం చెప్పలేదు.