News August 31, 2024

వచ్చే నెలలో 94 రైళ్లు రద్దు

image

వరంగల్-కాజీపేట నాలుగో లైన్ నిర్మాణ పనుల నేపథ్యంలో SEP-OCT మధ్యలో 94 రైళ్లను ఎంపిక చేసిన తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 41 రైళ్లను దారి మళ్లించనుండగా, మరో 27 రైళ్ల ప్రయాణ సమయాలను మార్చింది. రద్దైన వాటిలో గోల్కొండ, శాతవాహన ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ, సికింద్రాబాద్-కాగజ్‌నగర్, విజయవాడ-సికింద్రాబాద్, భద్రాచలం రోడ్-బల్లార్ష తదితర రైళ్లు ఉన్నాయి.

Similar News

News January 15, 2025

మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్

image

ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లబుషేన్, ఆయన సతీమణి రెబెకా ఈ ఏడాది ఏప్రిల్‌లో తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తమకు బాబు పుట్టబోతున్నాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో లబుషేన్ పోస్ట్ పెట్టారు. ‘ముగ్గురం నలుగురం కాబోతున్నాం’ అని పేర్కొన్నారు. లబుషేన్, రెబెకాకు 2017 వివాహం జరగగా, 2022లో కూతురు హాలీ జన్మించింది.

News January 15, 2025

SHOCK: టీవీల్లో ‘గేమ్ ఛేంజర్’!

image

‘గేమ్ ఛేంజర్’ సినిమా ఏపీలోని కేబుల్ టీవీలో ప్రసారం అవుతున్నట్లు తెలుస్తోంది. ‘AP LOCAL TV’ ఛానల్లో పైరసీ HD ప్రింట్ ప్రసారం చేస్తున్నారని కొందరు నెటిజన్లు X వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. కాగా ఈ సినిమా విడుదలకు ముందే కుట్రలు జరిగాయని మూవీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

News January 15, 2025

ఒక్కరోజులో 5626% పెరిగిన ట్రంప్ కాయిన్!

image

US ప్రెసిడెంట్‌గా ప్రమాణం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ పేరుతో ఒక క్రిప్టో కాయిన్ ఉందని తెలుసా! దానిపేరు First Crypto President. కొన్ని రోజుల క్రితం మొదలైన ఈ DTC మార్కెట్ విలువ $141.5M. మొత్తం సప్లై వంద కోట్ల కాయిన్లు. గత 24 గంటల్లో ఇది ఏకంగా 5626% పెరిగింది. $0.0003321 నుంచి $0.01800కు చేరుకుంది. భారత కరెన్సీలో ఇప్పుడు రూ.1.53 పలుకుతోంది. MAGA, WLFI, $POTUS, $DJT సైతం ట్రంప్‌తో సంబంధం ఉన్నవే.