News August 31, 2024

కాలుష్య నియంత్రణకు రూ.2.65 కోట్లతో ప్రణాళికలు- కలెక్టర్ అంబేడ్కర్

image

దేశంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాలలో విజయనగరం ఉందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. జాతీయ స్వచ్ఛ గాలి కార్య క్రమం అమలుపై శుక్రవారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా రూ.2.65 కోట్లతో ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు రూ.4.5 కోట్లు ఖర్చు చేశారని, ఈ మేరకు వచ్చిన ఫలితాలను తెలియజేయాలన్నారు. కాలుష్య కారకాలను నియంత్రించాలన్నారు.

Similar News

News March 1, 2026

విజయనగరంలో పోలీసుల ర్యాలీ

image

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం కోట జంక్షన్ నుంచి మూడు లాంతర్ల వరకు పోలీసులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని, వారి రక్షణకు పోలీసుశాఖ కట్టుబడి ఉందని డీఎస్పీ గోవిందరావు పేర్కొన్నారు. ఆపద సమయంలో సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘శక్తి’ యాప్‌ను ప్రతీ మహిళ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

News March 1, 2026

VZM: ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి

image

ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు కార్మికులు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుకి వినతిపత్రం అందించారు. 7300 మంది కార్మికులు ఉన్న థర్డ్‌పార్టీ విధానాన్ని రద్దు చేసి, నేరుగా సంస్థ నుంచి జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్టేట్‌ పబ్లిక్ సెక్రెటరీ అశోక్‌ డిమాండ్‌ చేశారు. అర్హత బట్టి రెగ్యులర్ చేయాలని కోరారు.

News March 1, 2026

VZM: ఉదయాన్నే ప్రమాదం.. వ్యక్తి మృతి

image

రామభద్రపురం మండలం బూసాయవలస(ముచర్ల వలస) గ్రామ సమీపంలో సాయి కృష్ణ ఆగ్రో కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఆదివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఇతని వయసు సుమారు 65 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీస్‌లు దర్యాప్తు చేస్తున్నారు.